వెయ్యి కిలోమీటర్లు దాటిన జగన్.. టీడీపీ రెస్పాన్స్...

 

వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. గత ఏడాది నవంబర్ 6న మొదలుపెట్టిన ఈయన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలు రాయి దాటింది. మొత్తం మూడువేల కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన జగన్ 74 రోజులుగా యాత్ర చేస్తున్నారు కడప, కర్నూల్, అనంతపూర్, చిత్తూరు జిల్లాలు పూర్తి చేసుకుని, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న జగన్‌ వెయ్యి కిలోమీటర్ల మైలురాయి దాటిన సందర్భంగా నెల్లూరు జిల్లా సైదాపురం వద్ద ఒక భారీ పైలాన్ స్థూపాన్ని ఆవిష్కరించారు.

 

ఇక జగన్ వెయ్యి కిలోమీటర్లు చేరుకున్న దానిపై తెలుగుదేశం పార్టీ కూడా స్పందించింది. మంత్రి కె.ఎస్.జవహర్ దీనిపై వ్యాఖ్యానిస్తూ జగన్ లక్ష కిలోమీటర్లు నడిచినా ముఖ్యమంత్రి కాలేరని అన్నారు.