కొత్త సంవత్సరంలో మొదటి అక్షింతలు.. వేసింది ఎవరో తెలుసా...?


వైసీపీ అధినేత జగన్ పై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తారన్న సంగతి తెలిసిందే. జగన్ ప్రతిపక్ష నేత కాబట్టి, జగన్ అధికార పక్షం నేతలను ఏదో ఒకటి అనడం... దానికి వారు జగన్ ను ఏదో ఒకటి అనడం కామన్. కానీ కొత్త సంవత్సరం రోజునే జగన్ కు అక్షింతలు వేసింది ఎవరో తెలుసా.. ఎవరో కాదు... అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వీరశివారెడ్డి. రాష్ట్ర విభజన ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరశివారెడ్డి... విభజన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. కొత్త సంవత్సరం సందర్భంగా... ఆత్మీయ విందు ఏర్పాటు చేసిన ఆయన.... జగన్ గురించి మాట్లాడుతూ....రాజశేఖర్‌రెడ్డిలో ఉన్న నైతికత జగన్‌లో లేదని... తనని నమ్ముకున్న వారి కోసం ఎంత వరుకు అయినా వెళ్ళే వారు అని, కాని జగన్ మాత్రం, తన నీడను కూడా నమ్మడు అని అన్నారు... ఆయనకు మనుషులు అంటే చులకన భావం అని, అహంకారం అని అన్నారు. జగన్ అంటే సొంత పార్టీ నేతలకే భరోసా లేదు అని, ఇలాంటి లక్షణాలు ఉన్న వాడు...ఎన్ని వేల కిలో మీటర్లు నడిస్తే ఏమవుతుంది...పాదయాత్ర చేస్తే సీఎం అవుతానన్న భ్రమలో ఉన్నాడు.. పాదయాత్ర కాదు... ముందు జగన్ తన అహంభావం తగ్గించుకుంటే, కనీసం ఎమ్మల్యే అయినా అవుతారు అని అన్నారు. మరి దీనిపై జగన్ ఎలా స్పందిస్తాడో చూద్దాం...