జగన్.. నెక్స్ట్ ఏంటి..!

 

అనుకున్నట్టే జరిగింది. వైసీపీ నేతలు భయపడినట్టే జరిగింది. పాపం.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో వ్యక్తిగత హాజరునుండి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారించిన కోర్టు పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలు ఏం చేయలో తెలియని పరిస్థితిలో పడ్డారు. అసలు ముందు నుండి పాదయాత్రపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. జగన్ పాదయాత్ర చేస్తాడా..?లేదా..?  చేస్తాడా..?లేదా..? అని అనుకున్నారు. కానీ.. ఆ తరువాత ఏదోలా పాదయాత్ర చేస్తున్నట్టు డేట్ ఫిక్స్ చేశారు.  నవంబర్ 2 నుండి పాదయాత్ర  చేయాలని అనుకున్నారు. ఆ తరువాత కోర్టు నిర్ణయం ఏమోస్తుందో తెలియక...మరోవైపు అసెంబ్లీ సమావేశాలు అంటూ ఏదో సాకు చెప్పి నవంబర్ మూడో వారానికి వాయిదా వేశారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత.. మరోపక్క చంద్రబాబును నానా మాటలు అనడం.. దానికి తోడు నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓడిపోవడం ఇవన్నీ జగన్ తనకు తానుగా తెచ్చుకున్న సమస్యలే. దీంతో మొత్తం ఏపీలోని 120 నియోజకవర్గాల వ్యాప్తంగా 3,000 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి.. ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకొని.. ఇప్పటివరకూ తనపై ఉన్న అపార్ధాలను కాస్తయినా తొలగించుకుందామని అనుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే జగన్ ఇప్పుడు ఏం చేస్తాడు అన్న సందేహాలు ఏర్పడుతున్నాయి.

 

అయితే కోర్టు తీర్పు అనంతరం... కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని..  వారంలోని మిగిలిన రోజుల్లో పాదయాత్ర కొనసాగుతుందని... శుక్రవారం నాడు కోర్టుకు జగన్ హాజరవుతారని చెప్పారు. కోర్టు విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో పాదయాత్ర ఎక్కడైతో ఆగుతుందో... విచారణ అనంతరం, మరుసటి రోజున సరిగ్గా అదే ప్రాంతం నుంచి కొనసాగుతుందని తెలిపారు. ప్రతివారం కోర్టుకు హాజరుకావాల్సిన నేపథ్యంలో, వారంలో ఒక రోజు పాదయాత్రకు బ్రేక్ పడుతుందని... దీంతో, అనుకున్న కాల వ్యవధికంటే మరిన్ని ఎక్కువ రోజులు పాదయాత్రకు పట్టే అవకాశం ఉందని చెప్పారు. ఆరు నెలల పాదయాత్ర ఏడు నెలలు కొనసాగే అవకాశం ఉందని అన్నారు. అంతేకాదు ఎట్టి పరిస్థితిలోనూ పాదయాత్ర చేసి తీరుతా అని జగన్ గతంలోనే చెప్పాడు. మరి కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు జగన్ అదే మాట మీద నిలబడి పాదయాత్ర చేస్తాడా...? లేదా...? అసలు జగన్ నెక్ట్స్ ప్లాన్ ఏం చేస్తాడో చూద్దాం...