Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ అనుకూల సర్వేల గోల!
posted on: Apr 21, 2014 6:01PM
.jpg)
ఈ ఎన్నికలలో అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో జగన్ పార్టీ అడ్రస్ గల్లంతు అయిపోవడం ఖాయమని, ఎన్నికల తర్వాత జగన్ చంచల్ గూడా జైల్లో పర్మినెంట్‌గా సెటిలవ్వక తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జాతీయ స్థాయి మీడియా సంస్థలు జరుపుతున్న సర్వేల్లో కూడా ఈ ఎన్నికలలో జగన్ పార్టీ ఊడబొడిచేది ఏదీ వుండదని స్పష్టంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజులుగా న్యూస్ పేపర్లలో కొన్ని విచిత్రమైన సర్వేలు వస్తున్నాయి. సీమాంధ్రలో జగన్ దుమ్ము దులిపేస్తాడని, తెలంగాణలో అదరగొట్టేస్తాడని ఆ సర్వేల సారాంశం. అడ్రస్ లేని సర్వే సంస్థలు జగన్ పార్టీకి ఇస్తున్న సీట్ల సంఖ్య చూసి కాకలు తీరిన రాజకీయ పరిశీలకులకు కూడా కళ్ళు తిరుగుతున్నాయి. కాస్తంత రాజకీయ పరిజ్ఞానం వున్నవాళ్ళక్కూడా ఇవన్నీ జగన్ సొంతగా చేయించుకున్న సర్వేలని తెలిసిపోతున్నాయి. ఈ సర్వేలని చూసి జనం నవ్వుకుంటారని తెలిసి కూడా వీటిని జనం మీద వదులుతున్న జగన్ తెంపరితనాన్ని ఏమనాలి?


.jpg)
.jpg)


