TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్లీ జగన్‌ యాత్ర

Published on: Fri Nov 22, 2013 6:50AM

 

సమైక్యరాష్ట్రన్ని కోరుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి యాత్ర చేపట్టనున్నారు. సమైఖ్య శంఖారావం పేరుతో తలపెట్టిన ఈ యాత్రను ఈ నెల 28 నుంచి మొదలు పెట్టనున్నారు. యాత్రను చిత్తూరుజిల్లా కుప్పం నియోజక వర్గంనుంచి మొదలు పెట్టి, రాయలసీమ, తెలంగాణల మీదుగా శ్రీకాకులంలో పూర్తిచేయనున్నారు. సమైక్య యాత్రతో పాటు ఓదార్పుయాత్రను కూడా జరపనున్నారు జగన్‌.

ఇంకా యాత్రకు సంబందించిన షెడ్యూల్‌ ఖరారు చేయలేదని, గతంలో ఇదే అంశంపై జగన్‌ సొదరి షర్మిల కూడా యాత్ర చేశారని ఇప్పుడు జగన్‌ చేపట్టబోయే యాత్రకు భారీ స్థాయిలో జనసమీకరణ జరపాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.