మరి కొద్ది సేపటిలో జగన్ బెయిలుపై కోర్టు తీర్పు

 

నాంపల్లి సీబీఐ కోర్టు మరి కొద్ది సేపటిలో జగన్మోహన్ రెడ్డి బెయిలుపై తన నిర్ణయం ప్రకటించబోతోంది. ఈసారి జగన్మోహన్ రెడ్డికి బెయిలు రావడం ఖాయమని అతని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు దృడంగా నమ్ముతున్నారు. అందుకే అతని లాయర్లు బెయిలు కోసం సమర్పించవలసిన పత్రాలను అన్నీ సిద్దం చేసుకొని కోర్టు తీర్పు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం నుండే జగన్మోహన్ రెడ్డి భార్య భారతి తదితరులు కోర్టుకి చేరుకొని తీర్పుకోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా వైకాపా కార్యకర్తలు, నేతలు కూడా చాలామంది తరలివచ్చారు. కోర్టు తన తీర్పును సాయంత్రం 4.30-5.00గంటల మధ్య వెలువరించి అవకాశం ఉంది.

 

జగన్మోహన్ రెడ్డి విడుదల అయితే, అది రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చవచ్చును. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయంతో తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసిందని ఆగ్రహంతో ఉన్న అనేకమంది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి వైకాపాలోకి దూకవచ్చును. అదేవిధంగా సమైక్యాంధ్ర పధం నోట నుండి ఉచ్చరించని చంద్రబాబుపై కూడా కినిసిన తెలుగు తమ్ముళ్ళు కూడా వైకాపాలోకి దూకే అవకాశం ఉంది. అయితే, రానున్న ఈనికలలో గెలవడం చాలా అవసరం గనుక జగన్మోహన్ రెడ్డి వారిలో కేవలం గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఈయవచ్చును.

 

ఇక అతనికి బెయిలు దొరుకుతుందా లేదా అనే విషయంపై ప్రజలే కాక, అన్ని రాజకీయ పార్టీలు చాల ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. మరి కొద్ది సేపటిలో ఏ సంగతి తెలిసిపోతుంది.