అందం చూసి రారు బాబు.. ఏం మాట్లాడుతున్నావ్..!


ఎంత చేసినా కుక్క తోక వంకరే అన్న సామెత గుర్తుంది కదా. ఇప్పుడు ఈ సామెత ఓ నాయకుడికి బాగా సూట్ అవుతుంది. అది ఎవరో కాదు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి. ఎన్నిసార్లు తెలిసొచ్చినా ఆ నోటిని మాత్రం కంట్రోల్ లో పెట్టుకోడు. నంద్యాల ఉపఎన్నికల్లో చంద్రబాబును కాల్చిపారేయాలని.. చంద్రబాబును నడిరోడ్డుమీద ఉరితీయాలి.. అబ్బో ఇలా ఒకటా రెండా నోటికొచ్చి మాట్లాడి దాని ఫలితాన్ని చూశాడు. అలాంటప్పుడు ఇప్పుడైనా కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. అలాంటిది ఏం లేదు. మళ్లీ అదే తంతు. ప్రజాసంకల్పం పేరుతో జగన్ పాదయాత్ర చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఇక ఈ పాదయాత్రలో కూడా జగన్ చంద్రబాబుపై ఎప్పటిలాగే నోరు పారేసుకున్నాడు.

 

ప్రస్తుతం చంద్రబాబు దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నసంగతి తెలిసిందే కదా. ఇక ఈ పర్యటనలో చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు తీసుకురావడానికి నానా కష్టాలు పడుతున్నారు. అంతేకాదు.. పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఆవిషయాన్ని ప్రకటించాయి కూడా. మరి ఈ విషయాలు ఏం తెలియని జగన్ మాత్రం...చంద్రబాబు మొహం చూసి ఎవడు పెట్టుబడులు పెడతాడని ప్రశ్నించాడు. అంతే ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. జగన్ తెలిసి మాట్లాడుతాడో.. తెలియక మాట్లాడుతాడో కూడా అర్దం కావట్లేదని అనుకుంటున్నారు. అలా అందం చూసి పెట్టుబడులు పెట్టడానికి వస్తే... అందరూ బ్యూటీ క్వీన్ లను విదేశీ మీటింగ్ లకి పంపేవారు. పెట్టుబడులు కోరే చోట మౌలిక సదుపాయాలు, అక్కడ నాయకుల సమర్ధత ఆధారంగా పెట్టుబడులు వస్తాయి. అంతేకాని అందం చూసి పెట్టుబడులు రావన్న సంగతి జగన్ కు తెలియకపోవడం మన ఖర్మ. ఇదేమీ పట్టించుకోకుండా చంద్రబాబు అందం గురించి మాట్లాడితే జగన్ కి ఒరిగేది ఏమీ ఉండదు. నష్టం తప్ప. నాయకుడుగా ఆయనకు సంస్కారం ఉన్నా, లేకున్నా వాటిని విని తీర్పు ఇచ్చే ప్రజలు సంస్కారవంతులు. ఓ ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వైఫల్యాలను జగన్ ఎండగట్టాలి అనుకోవడంలో తప్పులేదు. నిజానికి ఆ బాధ్యత మరిచిపోతేనే తప్పు. అయితే ఆ విమర్శలు ఎలా ఉండాలి అన్నదానిపై ఇప్పటికీ జగన్ కి అవగాహన రావడం లేదు. జగన్ బాబు ఇప్పటికైనా మాట్లాడటం చేతకాకపోతే ఎలా నాయనా...