జగన్ ను ఆకాశానికెత్తిన సబ్బం
Published on: Thu Jan 5, 2012 9:55AM
విశా
ఖపట్టణం: జగన్ పక్షాన నిలబడితే న్యాయం జరుగుతుందని జనాలు అనుకుంటున్నారని , ఆయన ఏ పిలుపిచ్చినా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు.విశాఖ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ పిలుపిచ్చినా విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు వేలాదిగా తరలివస్తారనేందుకు ఫీజుపోరే నిదర్శనమని అయన అన్నారు. వైఎస్సార్ బతికున్నపుడు ఏడాదికి 150 రోజులు జనాల్లో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే, జగన్ ఏడాదిలో 250 రోజులూ జనాలకోసమే శ్రమిస్తున్నారన్నారు.


