TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జ‌గ‌న్ ... టెన్త్ ఫెయిల్‌!

Published on: Wed Jun 8, 2022 6:31AM

అధికారం రావ‌డం కంటే అడ్డంకులు వైఫ‌ల్యాలే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి జ‌గ‌న్‌ని. 2019 లో అధికా రంలోకి వ‌చ్చిన‌ప్ప‌డు ఆ మొద‌టి సంవ‌త్స‌రం స‌ర‌దాగా గ‌డిపేసేడు. ఆ త‌ర్వాత 2020లో క‌రోనా పుణ్య‌మాని  పిల్లల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకుండానే పైత‌ర‌గ‌తుల‌కు ప్రొమోట్ చేసేరు. ఈ విధంగా  విద్యా శాఖ ప‌రంగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా గ‌డిచిపోయింద‌నుకున్నారు అధికారులు కూడా.  క‌రోనా ఆ విధంగా కొంత వుప శమనం క‌ల్గించింది. 2021లో కూడా అలాగే గడిచిపోయింది. 

ఇప్పుడు 2022లో  జ‌గ‌న్ ప్ర‌భుత్వం తొలిసారిగా టెన్త్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది.  క‌రోనా అవ‌రోధాన్ని అధిగ‌మించి నిర్వ‌హించిన టెన్త్ ప‌రీక్ష‌ల మొద‌టి రోజునే పేప‌ర్ లీక్ అయింద‌ని అన్నారు. అందుకు నారాయ‌ణ విద్యాసంస్థ‌నే త‌ప్ప‌ప‌ట్టారు. ఆయ‌న్ను ఏకంగా అరెస్టు చేసేరు. కానీ ఆ లీకేజీ వ్య‌వ‌హారం వెనుక ఎవ‌రున్నారన్న‌ది ఇంత‌వ‌ర‌కూ తేల‌నే లేదు. లీకులన్నీ వైసీపీవారి వాట్సాప్ లలోనే జరిగాయన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. మొద‌టిసారి నిర్వ‌హిస్తున్న ప‌రీక్ష‌ల్లో ఇలాంటి గంద‌ర గోళంతో ప‌రువు పొగొట్టుకుంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.  ఆ అవ‌రోధం దాటి పిల్ల‌ల త‌లి దండ్రులు శ‌భాష్ అంటార‌ని అనుకున్నారు. కానీ జ‌రిగిందేమిటి?  అవ‌క త‌వ‌క‌లు జ‌రిగేయోమెన‌న్న అనుమానాలు అంద‌రినీ వెంటాడాయి. కాదని చెప్పుకోవ‌డానికి ప్ర‌భు త్వం నానా కంగాళీ అయింది. 
ఫ‌లితాల ప్ర‌క‌ట‌న కూడా కాస్తంత ఆల‌స్యం జ‌రిగింది.  దీనిమీద కూడా అనుమానాలు వెల్లువెత్తాయి. బొత్స వంటి సీనియ‌ర్ విద్యాశాఖ మంత్రిగా వున్నా ఆల‌స్యం జ‌ర‌గ‌డ‌మేమిట‌నుకున్నారు. మొత్తానికి సోమ‌వారం ప్ర‌కటించేరు.  ఫ‌లితాల్లో అవ‌క‌త‌వ‌క‌లు వెలుగు చూశాయి. పాస్ ప‌ర్సంటేజి బాగా త‌గ్గ‌డం కూడా  ప‌లు అనుమానాల‌కు దారితీసింది. 
అస‌లు పాసు మార్కులు రాని విద్యార్ధి ఏకంగా టెన్త్ పాస‌యిపోవ‌డం! ఇదెలా సాధ్యం అంటే టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్ అని  స‌ద‌రు శాఖ అధికారులు అని చేతులు దులిపేసుకోవ‌చ్చు.

కానీ  ఇలాంటి పొర‌పాట్లే ప్ర‌భు త్వం ప‌రువు న‌ట్టేట ముంచేది.  ఘోర‌మ‌యిన త‌ప్పిదాలు జరిగితే ఎలా?  విద్యార్ధులు బాగా చ‌దివి మంచి మార్కు ల‌తోనో, ర‌మార‌మి మార్కుల‌తోనో పాస్‌కావ‌డం వేరు. పాస్ కావ‌డానికి అవ‌కాశం లేని విద్యార్ధి పాస్ అయిపోవ‌డం జ‌రిగిపోయింది. విజయవాడకు చెందిన ఓ విద్యార్థికి మొత్తం 170 మార్కులే రావడం..అయినా అతడు పాస్ అయినట్లు పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ఆరు పేపర్ల లెక్క తీసు కున్నా.. సబ్జెక్టుకు 35 చొప్పున 210 మార్కులు వస్తేనే పాస్. కానీ విద్యార్థి అంతకంటే తక్కువ  స్కోర్ చేశాడు. అంతేకాదు.. సోషల్ స్టడీస్ లో 11 మార్కులు లెక్క్లల్లో 17 మార్కులు వచ్చాయి.  ఎలా చూసినా ఫెయిలే. కానీ పాస్ అంటూ ఫలితాల్లో పేర్కొన్నారు. జ‌గ‌న్ పాల‌న‌లో ఏదీ స‌వ్యంగా జ‌ర‌గ‌డం లేద‌న్న‌దానికి  ఇదో పెద్ద వుదాహ‌ర‌ణ‌.