TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జబర్దస్త్‌ నటి బర్త్‌డే వేడుకల్లో టీడీపీ, TNSF నేతల మధ్య ఘర్షణ..!

Published on: Thu Aug 27, 2026 12:54PM

 

రేవ్‌ పార్టీలో  క‌త్తులతో దాడి చేసుకున్న నేతలు..! 

 జబర్దస్త్‌ ఫేమ్‌ నటి అను పుట్టినరోజు వేడుకలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం సమీపంలోని హ్యాపీ నేచర్‌ రిసార్ట్స్‌లో నిర్వహించిన పార్టీలో టీడీపీ, TNSF నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. మద్యం మత్తులో రెండు వర్గాలుగా విడిపోయిన నాయకులు పరస్పరం గొడవకు దిగినట్లు సమాచారం. జబర్దస్త్‌ ఫేమ్‌ నటి అను తన పుట్టినరోజు వేడుకలు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం సమీపంలోని హ్యాపీ నేచర్‌ రిసార్ట్స్‌లో నిర్వహించింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన ఈ వేడుకలకు సుమారు 70 మంది వరకు హాజరైనట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో పార్టీలో ఉన్న కొందరి మధ్య వివాదం మొదలై క్రమంగా ఘర్షణకు దారితీసింది.

ఈ క్రమంలోనే టీడీపీ నేత మమ్ముల వెంకట్‌ దినేష్‌పై యర్రా చరణ్‌తేజ్ కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కత్తి దాడిలో వెంకట్‌ దినేష్‌ ఎడమ భుజం వెనుక భాగంలో తీవ్ర గాయ మైనట్లు సమాచారం. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం విశాఖలోని విమ్స్‌ ఆస్పత్రికి తరలిం చారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రిసార్టుకు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై ఆనందపురం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఘర్షణకు దారితీసిన కారణాలు, దాడిలో పాల్గొన్న ఇతర వ్యక్తుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ స్వరూపంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రేవ్‌ పార్టీగా పేర్కొంటున్న ఈ వేడుకల్లో డ్రగ్స్‌ వినియోగం జరిగిందా? లేదా అనే కోణంలోనూ విచారణ సాగుతున్నది. పార్టీకి హాజరైన వారి వివరాలు, రిసార్టులో జరిగిన పరిణామాలు, ఘర్షణకు అసలు కారణం తదితర అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.

 

Jabardasth fame actress Anus birthday celebrations, Rave Party,  TNSF, Mammula Venkat Dhinesa, Yarra Charan Tej, CM Chandrababu, Naralokesh, Telugu news, Telugu one