జబర్దస్త్ వినోదిని మీద హత్యాయత్నం !

 

తెలుగు బుల్లితెర మీద టాప్‌ షోగా నడుస్తోంది జబర్దస్త్. బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన ఈ షోలో నటులు కూడా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం. ఈ షోలో లేడీ గెటప్‌ లో నటించే నటుడు వినోద్‌ మీద హత్యాయత్నం జరిగింది. హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని ఇంటి యజమానే దాడి చేసినట్టుగా వినోద్ పోలీసులకి కంప్లైంట్ చేశారు. పోలీసులు ఇంటి యజమానికి అరెస్ట్‌ చేసి, విచరాణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో వినోద్ కంటి భాగంలో తీవ్ర గాయమైంది. అయితే ఈ దాడి ఎందుకు జరిగింది ? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? అనే విషయాలు మాత్రం తెలియలేదు.

అయితే ఇంటి యజమాని దాడి అని చెబుతుండడంతో ఆర్ధిక సంబంధమైన విషయాల వలన ఏమైనా దాడి జరిగిందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం మీద మరింత క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో కూడా వినోద్ ఆత్మహత్యా యత్నం చేసి వార్తల్లోకి ఎక్కాడు. తనకి ఇష్టం లేకుండా బలవంతంగా మేనకోడలితో పెళ్లి చేస్తున్నారని చేయి కోసుకున్నాడు. ఆ తర్వాత అదేమీ లేదని మీడియాలో క్లారిటీ ఇచ్చినా అప్పటికే ఆ విషయం వైరల్ అయిపొయింది. అప్పుడు ఆత్మహత్యాయత్నం ఇప్పుడు హత్యాయత్నంతో ఈయన మళ్ళీ హెడ్ లైన్స్ లోకి ఎక్కారు.