ఐవైఆర్‌పై మరో వేటు

ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో వేటు వేసింది. ఏపీ అర్చకుల, ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ఐవైఆర్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రాహ్మణులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదంటూ వ్యాఖ్యానించడంతో పాటు.. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొందరు సోషల్ మీడియాలో చేసిన కామెంట్లకు కృష్ణారావు లైక్ కొట్టడం అప్పట్లో.. సంచలనంగా మారింది. ఆయన చర్యలపై ఆగ్రహాం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పోరేషన్ పదవి నుంచి తొలగించింది. అయినప్పటికీ ప్రభుత్వంపైనా.. సీఎం చంద్రబాబుపైనా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండటంతో అర్చకుల, ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఛైర్మన్ పదవి నుంచి కూడా తొలగించింది.