TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్ర‌బాబుకి దారి సుగ‌మం అయిన‌ట్టేనా!

Published on: Sat Jul 9, 2022 11:42AM

 

రాజ్యాధికారం కాపాడుకోవ‌డానికి సెంటిమెంట్లేవీ ప‌నికిరావ‌ని జ‌గ‌న్ నిరూపించారు. ప్లీన‌రీ పేరుతో జ‌రిగిన స‌మావేశంలో వైసీపీ గౌర‌వ‌ అధ్య‌క్ష స్థానం నుంచి ఆయ‌న త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌ను త‌ప్పించారు.  చాలా కాలం నుంచే చెల్లెలు ష‌ర్మిల దూరమై తెలంగాణాకి వ‌చ్చి వేరు పార్టీ పెట్టి ప్ర‌చారం చేసుకుంటున్న‌ది. ఇపుడు ఆంధ్రాలో వైసీపీ ప్ర‌భుత్వానికి నూక‌లు చెల్లుతున్నాయ‌ని గ‌ట్టి ప్ర‌చారం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రిగా త‌న స్థానాన్ని కాపాడుకోవ‌డానికి గట్టి నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింది. వైసీపీ ప్లీన‌రీతో టిడిపికి ముందు ముందు ప్ర‌జ‌ల ఆహ్వానానికి మార్గం సుగ‌మం అయిన‌ట్టేన‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది.

విజ‌య‌ల‌క్ష్మి త‌న ప‌ద‌వినే కాకుండా, పార్టీ స‌భ్య‌త్వం కూడా వ‌దిలేశారు. చెల్లెలు ష‌ర్మిల ప‌ట్ల చాలాకాలం నుంచి మొగ్గు చూపుతోన్న విజ‌య‌ల‌క్ష్మిని త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పించితే పార్టీ వ‌ర్గాల‌ను, అభిమానుల‌ను మ‌రింత అజ‌మాయిషీ చేయ‌వ‌చ్చ‌ని ఆలోచ‌న‌లో ప‌డి వుండ‌వ‌చ్చు. అయితే ఇప్ప‌టికే అనేక విమ‌ర్శ‌ల‌కు, పార్టీ నాయ‌కుల మ‌ధ్య విభేదాల‌కు పార్టీ ప‌రంగా ప్ర‌భుత్వప‌రంగా జ‌గ‌న్ అవ‌మానాలు ఎదుర్కొంటున్నా రు. 

రాష్ట్రంలో తాజాగా నెల‌కొన్న ప‌రిస్థితులు విప‌క్ష తెలుగుదేశానికి మ‌రింత ఉత్సాహాన్ని క‌లిగిస్తుంది. రాష్ట్రం లో ఇప్ప‌టికే జ‌గ‌న్ ప‌ట్ల విప‌క్షాలే కాకుండా ప్ర‌జ‌లు కూడా చాలా అసంతృప్తితో వున్నారు. ప్ర‌భుత్వం ఏర్పా టు సంద‌ర్భంలో ఇచ్చిన హామీలేవీ నెర‌వేర్చ‌లేక‌పోయారు. అన్నింటిక‌న్నా ముఖ్యంగా రాజ‌ధాని అంశం లో నెల‌కొన్న వివాదాల‌కు ప‌రిష్కార‌మే లేకుండా పోతోంది. మాట‌లు మార్చి న‌చ్చ‌జెప్పే ప‌ద్ధ‌తి జ‌గ‌న్ టీమ్ కి ప‌రిపాటి అయింది. క్ర‌మేపీ మంత్రులు, ఎమ్మెల్యేల మ‌ధ్య వివాదాలు సినిమా చూసిన‌ట్టు ప్ర‌జ‌లు గ‌మ నించారు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టిడిపి ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను మ‌రింత అనుకూ లం చేసుకోవ‌డానికి ఎంతో వీలుంది. ఇప్ప‌టికే టిడిపీ నాయ‌కులు వైసీపీ ప్లీన‌రీ మీద అనేక వ్యాఖ్యలు చేశారు. ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు త‌ల్లి, చెల్లి ప్రేమ‌లు లేవ‌ని అలాంటపుడు రాష్ట్ర ప్ర‌జ‌ల మీద ప్రేమ‌, అభివృద్ధి ఆకాంక్ష‌లు ఎలా వుంటాయ‌ని ప్రశ్నిస్తున్నారు. 

టిడిపి నిర్వ‌హించిన మ‌హానాడులో పార్టీ ప‌రిస్థితి, రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డానికి ఎలా స‌మాయ‌త్తం కావాల‌న్న ఆలోచ‌న‌లే నాయ‌కుల ప్ర‌సంగాల్లో స్ప‌ష్ట‌మ‌యింది. పార్టీ ప్లీన‌రీలు పార్టీ ప‌టిష్ట‌త‌ను, అభిమాను ల‌ను మ‌రింత ఆక‌ట్టుకునే య‌త్నాల గురించి, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అందించాల్సిన సేవ‌ల గురించి ప్ర‌స్తావిం చ‌డం క‌ద్దు. కానీ వైసీపీ ప్లీన‌రీ అలాంటిదేమీ చేప‌ట్ట‌క‌పోవ‌డం ఇంట్లో ఫంక్ష‌న్‌లాగా ముగిసింది. పైగా విజ య ల‌క్ష్మి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన త‌ర్వాత స‌భ అంత ముగిసిన వాతావ‌ర‌ణ‌మే కొట్టొచ్చిన‌ట్టు క‌న‌ప‌డింది. భోజ‌నాలు చేసి  వ‌చ్చిన‌వారిలో చాలామంది తిరిగి వెళ్ల‌డంలోనే అస‌లు ఆ పార్టీలో ముఖ్యుల మ‌ధ్య స‌ఖ్య‌త‌, గౌర‌వాభిమానాలు ఎలా వున్నాయ‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌యింది. 

రాష్ట్రంలో ఇపుడు నెల‌కొన్న ప‌రిస్థితుల్లో ఇక అంద‌రి దృష్టీ చంద్ర‌బాబునాయుడు రాక మీద‌నే వున్న‌ది. టీడీపీకి మ‌ళ్లీ అధికార అవ‌కాశం ఇవ్వాల్సిన త‌రుణం వ‌చ్చింద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. జ‌గ‌న్ కు ఏ విధంగానూ రాష్ట్ర ప్ర‌గ‌తి మీద ధ్యాస లేద‌ని స్ప‌ష్ట‌మ‌యింది. ఇక టిడిపీ పూనుకుని విజృంభించి రాజ్యాధి కారానికి వేగిరం స‌మాయ‌త్తం కావాల్సిన అవ‌స‌రం వుంది.  వైసీపీ ప్లీన‌రీ జ‌గ‌న్ కు ఎంత‌వ‌ర‌కూ ఉప‌క‌రి స్తుందో ఏమోగాని  వ‌చ్చే రోజుల్లో టిడిపి అధినేత చంద్ర‌బాబుకి మార్గం మ‌రింత సుగ‌మం కావ‌డానికి వీలు చేసిన‌ట్ట‌యింది.