ఢిల్లీ లిక్క‌ర్ లింకులు. ..ఆర్‌.ఎస్‌.బ్ర‌ద‌ర్స్‌పై ఐటి దాడులు

posted on: Oct 14, 2022 2:25PM

ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో అరెస్ట‌యిన అశోక్‌రావు ఇచ్చిన స‌మాచారం మేర‌కే రాష్ట్రంలో ప‌లు ప్రాంతా ల్లో ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో ప‌లుప్రాంతాల్లోని ప్ర‌ముఖంగా ఆర్‌.ఎస్‌. బ్ర‌ద‌ర్స్ వ‌స్త్రదుకాణాల మీద దాడులు జ‌రుగుతున్నాయి. ఆయ‌న వీటిలో పెట్టుబ‌డులు పెట్టారన్న సంగ‌తి తేల‌డంతో దాడులు తీవ్ర‌వ‌త‌రం చేశారు. ముందు మామూలు ఐటీ దాడులు అనే అంద‌రూ భావించారు. కానీ, అశోక్ రావు పెట్టుబ‌డులు పెట్టార‌న్న సంగ‌తి వెలుగుచూడ‌డంతో, ఈ దాడుల‌కు లిక్క‌ర్ లింకులు ఉన్నాయ‌న్న సంగ‌తి తెలిసి న‌గ‌ర ప్ర‌జ‌లు ఆశ్య‌ర్య ప‌డుతున్నారు. 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరోసారి ఐటీ అధికారుల రైడ్స్ కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో  ప‌ది చోట్ల ఏకకాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులు మాదాపూర్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్, హైటెక్ సిటీ, ఆర్.ఎస్ బ్రదర్ సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు రాజధానిలో ఈడీ , సీబీఐ అధికా రుల దాడి జరగగా..తాజాగా ఐటీ  అధికారులు దాడులకు పాల్పడడం సంచలనంగా మారింది. 

వ‌స్త్ర ప్ర‌పంచంలో అత్యంత ప్ర‌సిద్ధిపొందిన‌వాటిలో ఆర్‌.ఎస్‌. బ్ర‌ద‌ర్స్ ఒక‌టి. రాష్ట్రంలో, ముఖ్యంగా రాజ ధాని హైద‌రాబాద్‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల్లో ప్ర‌తీ శుభ‌కార్యానికి ఆర్‌.ఎస్‌.బ్ర‌ద‌ర్స్ ఉందిగ‌దా ఇక దిగులే మిటి అన్న‌ట్టుగా చీర‌ల‌కు, న‌గ‌ల‌కు కూడా ఆ దుకాణానికే వెళ్ల‌డం ప‌రిపాటి. పిల్ల‌ల డ్ర‌స్‌లు, పెద్ద‌వాళ్ల దుస్తులు, చీర‌లు అన‌గానే ఆర్‌.ఎస్కే వెళ్ల‌డం బాగా అల‌వాటుగా మారింది. ఇపుడు హైద‌రా బాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఆర్‌.ఎస్‌.బ్ర‌ద‌ర్స్ వ‌స్త్ర దుకాణాల‌పై ఐటి దాడులు జ‌రుగుతున్నాయి.

ఇలాంటి మాల్స్ ఆర్ధికంగా అన‌తికాలంలోనే అభివృద్ధి చెంద‌డం, లావాదేవీలు, వ్యాపార అంశాల మీద ఐటీ అధికారులు ప్రశ్నించ‌నున్నారు. హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లి, మాదాపూర్‌, హైటెక్ సిటీ, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో ఉన్న ఆర్‌.ఎస్‌.బ్ర‌ద‌ర్స్ మాల్స్‌పై ఒక్క‌సారిగా ఐటి దాడులు జ‌రుగుతున్నాయి. ఇటీ వ‌లి ఈ ఐటి దాడులు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో, హైద‌రాబాద్‌లోనూ త‌ర‌చూ జ‌రుగుతూండ‌డం గ‌మ‌నిస్తున్నాం. అయితే ప్ర‌త్యేకించి వ‌స్త్ర‌దుకాణాలు, మాల్స్ మీద దాడులు జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి. అందులోనూ అందరినీ ఎంత‌గానో చాలాకాలం నుంచి ఆక‌ట్టుకుంటున్న పెద్ద వ‌స్త్ర మాల్ ఆర్‌.ఎస్‌.పై దాడి ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...