TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు.. నెక్స్ట్ టార్గెట్ ఆయనేనా?

Published on: Tue Jul 6, 2021 1:07PM

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి షాక్ తగిలింది. రాంకీ గ్రూప్ సంస్థలపై ఇన్ కం ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాంకీ సంస్థల అధిపతి అయోధ్య రామిరెడ్డి నివాసంలో, కార్యాలయాల్లో ఐటి అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు జరుపుతున్నారు. అయోధ్య రామిరెడ్డికి చెందిన గచ్చిబౌలి నివాసంతో  పాటు గచ్చిబౌలి రాంకి ప్రధాన కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. రాంకి అనుబంధ సంస్థల్లో సైతం ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 15 బృందాలతో వివిధ ప్రాంతల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం వైసిపి నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన సంస్థలపై ఐటి దాడులు జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.రాంకీ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సంస్థగా గుర్తింపు పొందింది.  ఈ సంస్థపై ఇటీవల కొన్ని టివి ఛానెళ్లు భూకబ్జా ఆరోపణలు గుప్పిస్తూ ప్రచారం చేశాయి. పెద్దమొత్తంలో భూమిని కబ్జా చేశారని వార్తా కథనాలు ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన సంస్థలపై ఐటి దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. వైసిపి ఎంపీపై దాడులు జరగడం ఆంధ్రాలో సైతం చర్చనీయాంశమైంది. ఎంపీ అయోధ్య రామిరెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నేతల కార్యాలయాల్లోనూ సోదాలు జరగబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది.