TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్నేహా గ్రూప్ సంస్థలపై ఐటీ దాడులు: తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు.!

Published on: Sat Nov 21, 2026 9:10AM

తెలుగు రాష్ట్రాలలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రముఖ పౌల్ట్రీ  వ్యవసాయ అనుబంధ వ్యాపార సంస్థ అయిన స్నేహ గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.  సంస్థ కార్యాలయాలు, సంబంధిత ప్రాంగణాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ అధికారులు విస్తృతంగా పరిశీలన జరిపారు.

హైదరాబాద్‌  కొండాపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థకు చెందిన డైరెక్టర్లు రామ్‌రెడ్డి డెండి, వరుణ్ రెడ్డి డెండి, స్నేహ డెండి ఇళ్లలో ఐటీ బృందాలు రికార్డులు, పత్రాలను తనిఖీ చేశాయి. హైదరాబాద్, విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లోని సంస్థకు సంబంధించిన కార్యాలయాలు, యూనిట్లలోనూ సోదాలు సాగాయి. 
పౌల్ట్రీ రంగంలో విస్తృత స్థాయి  నెట్‌వర్క్ కలిగిన స్నేహ గ్రూప్, రెండు వేల మందికి పైగా కాంట్రాక్ట్ రైతులతో కలిసి పనిచేస్తోంది. చికెన్ ఉత్పత్తి, ప్రాసెసింగ్‌తో పాటు అనుబంధ వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల రంగంలో దశాబ్దాలుగా అగ్రగామిగా కొనసాగుతున్న స్నేహా గ్రూప్ సంస్థలపై ఏక కాలంలో  తనిఖీలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 
సోదాల సమయంలో స్వాధీనం ఐటీ అధికారులు పలు కీలక పత్రాలు,   డిజిటల్ డేటా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  తనిఖీల ప్రక్రియ కొనసాగుతున్నందున, ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాల అధికారికంగా వెల్లడి కాలేదు. సంస్థ ప్రతినిధుల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు.  మున్ముందు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సేకరించిన సమాచారం ఆధారంగా తదుపరి విచారణ లేదా నోటీసుల ప్రక్రియ ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.  తనిఖీలు పూర్తై అధికారులు వివరాలు వెల్లడించిన తరువాతనే ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.  


[IT raids  Sneha Farms,Poultry companies, TeluguStates,   Sneha Farms businesses, TeluguOne]