హైదరాబాద్ లో ఐటీ సోదాల కలకలం
Published on: Wed Sep 17, 2025 10:16AM
.webp)
హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. బంగారం దుకాణాలే లక్ష్యంగా ఐటీ అధికారులు హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్, వరంగల్ నగరాలలో ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో బుధవారం (సెప్టెంబర్ 17) ఉదయం నుంచి ఐటీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి ఏకకాలంటలో 15 ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ లోని బంగారం వ్యాపారి జగదీష్ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు, లెక్కకు మించిన ఆస్తులు, నగలు ఉన్నట్లుగా గుర్తించినట్లు చెబుతున్నారు. మరోవైపు వరంగల్ లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక బంజారా హిల్స్ లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహి స్తున్నారు. ఈ సోదాలలో క్యాప్స్ గోల్డ్ కంపెనీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేసి రిటైల్ షాపులకు అమ్ముతున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకులు పాల్పడ్డట్టు గుర్తించారని చెబుతున్నారు. అంతే కాకుండా పెద్ద మొత్తంలో బంగారం బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు కూడా ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.


