సంక్షేమ పథకాలకు కేరాఫ్ తెలంగాణ--కేటీఆర్
Published on: Mon Jul 30, 2018 6:12PM
విపక్ష నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.తిన్నది అరగకనే సీఎం కేసీఆర్‌పై, ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.సోమవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. సంక్షేమ పథకాలకు కేరాఫ్ తెలంగాణ అని అన్నారు.కేసీఆర్ పాలనలో అన్నదాతకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.శ్రీరామరాజ్యంలో కూడా భూమిశిస్తు కట్టారు.కానీ కేసీఆర్ పాలనలో మాత్రం రైతులకే డబ్బులు ఇస్తున్నారని పేర్కొన్నారు.
.jpg)
చరిత్రలో ఎవరూ చేయని పనులు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని చెప్పారు.గీతన్నకు, నేతన్నకు, బోధకాలు బాధితులు సహా వృద్ధులు, బీడీ కార్మికులు,ఒంటరి, వితంతు మహిళలకు పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో 29 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి ద్వారా ప్రతి పేదింటి బిడ్డకూ ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డ పుడితే రూ.13వేలు అందిస్తున్నామని,రాష్ట్రంలో ప్రతి పేదవాడి కడుపు నిండాలనే ఉద్దేశంతో సన్న బియ్యం అందిస్తున్నామని అన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకూ కేటీఆర్ కిట్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ సాక్షిగా అన్నారని గుర్తుచేశారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ఢిల్లీలోని ప్రధానికి అర్థమైంది కానీ తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులకు మాత్రం అర్థం కావడంలేదని నిప్పులు చెరిగారు.


