Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి మరి కొద్ది గంటల్లో కౌంట్ డౌన్
posted on: Jul 29, 2025 10:36AM

మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నాసాతో కలిసి చేయనున్న ఈ కీలక ప్రయోగానికి మంగళవారం (జులై 29) మధ్యాహ్నం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 రాకెట్‌ను బుధవారం (జులై 30) సాయంత్రం ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి నిసార్ ఉపగ్రహాన్ని పంపించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన 2,393 కిలోల బరువైన నిసార్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్ట బోతున్నారు. ఈ ఉపగ్రహం భూమిని అణువణువూ స్కాన్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంది. ఇక, జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 రాకెట్ ప్రయోగం నేపథ్‌యంలో నాసా శాస్త్రవేత్తలు శ్రీహరి కోట చేరుకున్నారు. మంగళవారం (జులై 29) మధ్యాహ్నం 2 గంటల పది నిముషాలకు నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమౌతుంది. బుధవారం సాయంత్రం 5 గంటల 40 నిముషాలకు రాకెట్ ప్రయోగం జరుగుతుంది.


.webp)



