TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెంగాలమ్మ సేవలో ఇస్రో చైర్మన్

Published on: Sat Jan 10, 2026 3:38PM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ పరమేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. వారికి సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

 అనంతరం వేద పండితులచే అమ్మవారికి పూజలు నిర్వహించారు.  ఈ నెల 12న ఇస్రో సీఎస్ఎల్వీ- సి62 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్ధించినట్లు ఇస్రొ చైర్మన్ తెలిపారు.  ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణలతో   ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ను సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ వి. నారాయణన్  రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆదివారం ఉదయం 12.19 గంటలకు ప్రారంభమౌతుందన్నారు.  ఆ మరుసటి రోజు అంటే సోమవారం (జనవరి 12 )ఉదయం  10.19 గంటలకు పీఎస్‌ఎల్‌వి -సి62 రాకెట్‌ ద్వారా ఈఓఎస్‌ -ఎన్‌1 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.