TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లాడెన్‌లానే ఖురేషీ ఖ‌తం.. ఒకే త‌ర‌హాలో వెంటాడి..వేటాడి...

Published on: Fri Feb 4, 2022 11:05AM

సేమ్ టూ సేమ్‌. ఒకే త‌ర‌హా అటాక్‌. ఇంటిపైన హెలికాప్ట‌ర్‌తో యూఎస్ నేవీ షీల్డ్‌ క‌మెండోల ఎంట్రీ. హోరా హోరీ ఫైరింగ్‌. టార్గెట్ ఫినిష్‌. డీఎన్ఏ టెస్ట్ కన్ఫామ్‌. క్లైమాక్స్‌లో హెలికాప్ట‌ర్‌ ట్ర‌బుల్‌. దాన్ని బ్లాస్ట్ చేసి.. వ‌చ్చిన దారినే ఎస్కేప్‌. నిమిషాల్లో బిగ్ టాస్క్ కంప్లీట్‌. ఇదీ అమెరిక‌న్ ఆర్మీ స‌త్తా. 

సేమ్ టూ సేమ్‌.. ఆల్‌ఖైదా చీఫ్ బిన్ లాడెన్‌ను చంపిన‌ట్టుగానే.. ఇస్లామిక్ స్టేట్‌-ఐఎస్ చీప్ అల్‌-ఖురేషీనీ మ‌ట్టుబెట్టింది అమెరికా. కాక‌పోతే.. చిన్న ఛేంజ్‌. యూఎస్ సోల్జ‌ర్స్ త‌న‌ను చంప‌కుండానే.. త‌న‌కు తాను సూసైడ్ బాంబ‌ర్‌గా మారి.. త‌న‌తో పాటు త‌న ఫ్యామిలీనీ పేల్చేసుకున్నాడు ఆ మోస్ట్‌వాంటెడ్ టెర్ర‌రిస్ట్‌.  

సిరియాలో అమెరికా దళాలు చుట్టుముట్టడంతో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) గ్రూప్‌ చీఫ్‌ అబూ ఇబ్రహీం అల్‌-హషిమీ అల్‌-ఖురేషీ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో ఖురేషీతో పాటు అతని కుటుంబంలోని మహిళలు, పిల్లలు దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. అమెరికా కమాండోల దాడిలో ఇస్లామిక్‌ స్టేట్‌ కీలక నేత అబూ బకర్‌ అల్‌ బగ్దాది హతమయ్యాక 2019 అక్టోబరు 31న ఖురేషీ అతని స్థానంలోకి వచ్చాడు.   

సిరియా- టర్మీ సరిహద్దుకు సమీపంలో అత్మేహ్‌ పట్టణ శివారులోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఖురేషీ ఉన్నట్టు నిర్ధారించుకున్న అమెరికా ప్రత్యేక దళాలు స‌ర్జిక‌ల్ స్టైక్ చేశాయి. హెలికాప్టర్లతో ఆ భవనంపైకి దిగిన యూఎస్ సోల్జ‌ర్స్‌కు.. భ‌వ‌నం లోపలున్న ఉగ్రవాదులకు మ‌ధ్య రెండు గంటలకు పైగా హోరాహోరీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. దాడుల్లో అమాయకులెవరూ చనిపోరాదనే అధ్య‌క్షుడు బైడెన్‌ ఆదేశాల వల్లే వైమానిక దాడులు జరపలేదని తెలుస్తోంది. 

ఇక త‌న చావు త‌ప్ప‌ద‌ని క‌న్ఫామ్ చేసుకున్న ఖురేషీ.. అమెరిక‌న్ సైనికుల చేతిలో చ‌నిపోవ‌డం ఇష్టం లేక‌.. త‌న‌ను తాను బాంబుల‌తో పేల్చుకున్నాడు. ఆ పేలుడుతో ఖురేషీతో పాటు ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలు సహా 13 మంది మరణించినట్టు తెలుస్తోంది. డెడ్‌బాడీస్‌ డీఎన్‌ఏను విశ్లేషించాకే ఖురేషీ మృతిని ధ్రువీకరించినట్టు అమెరికా అధికారులు తెలిపారు. ఈ అటాక్ అనంతరం తిరిగి వెళ్తుండగా ఓ హెలికాప్టర్‌లో టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్‌ తలెత్తగా దాన్ని అక్క‌డే ధ్వంసం చేసేసి.. మ‌రో హెలికాప్ట‌ర్‌లో వెళ్లిపోయారు ఆ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్న సైనికులు. బిన్‌ లాడెన్‌పై జ‌రిపిన ఆర్మీ ఆప‌రేష‌న్‌లోనూ ఇలానే జ‌ర‌గ‌డం ఆస‌క్తిక‌రం.