TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గంభీర్‌కు ఉగ్ర‌వాదుల బెదిరింపు.. సెక్యూరిటీ పెంపు..

Published on: Wed Nov 24, 2021 10:49AM

మాజీ క్రికెట‌ర్ మాత్ర‌మే కాదు.. పార్ల‌మెంట్ స‌భ్యుడు కూడా. డాషింగ్ ఓపెన‌ర్ మాత్ర‌మే కాదు.. బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడ‌ర్ కూడా. అలాంటి గౌత‌మ్ గంభీర్‌ను ఉగ్ర‌వాదులు టార్గెట్ చేశారు. చంపేస్తామంటూ బెదిరించారు. బీజేపీ త‌ర‌ఫున పాకిస్తాన్‌పై ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తూ.. క‌శ్మీర్‌కు చెందిన ఐఎస్ఐఎస్ టెర్ర‌రిస్టుల లిస్టులో చేరాడు గౌతం గంభీర్‌. బీజేపీ నేత కావ‌డం, క్రికెట‌ర్‌గా మంచి ఇమేజ్ ఉండ‌టం, ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌టం.. ఇలా బాగా పాపులర్ అయిన గంభీర్‌కు ఉగ్ర‌వాదులు వార్నింగ్ ఇవ్వ‌డంతో ఢిల్లీ పోలీసులు ఒక్క‌సారిగా అల‌ర్ట్ అయ్యారు. ఆయ‌న ఇంటి ద‌గ్గ‌ర భ‌ద్ర‌త‌ను మ‌రింత‌ పెంచారు.

గౌత‌మ్ గంభీర్‌కు ఈ-మెయిల్స్‌లో బెదిరింపులు వచ్చాయి. కశ్మీర్ ఐసిస్ ఉగ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంభీర్‌కు బెదిరింపు లేఖ పంపిన ఈ-మెయిల్ అడ్రస్‌ను గుర్తించే దిశ‌గా విచారణ జరుపుతున్నారు.

ఎంపీ గౌతమ్ గంభీర్ ఫిర్యాదుపై దర్యాప్తు జరుపుతున్నామని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు. బెదిరింపులతో ఢిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని గౌతమ్ గంభీర్ ఇంటి ద‌గ్గ‌ర‌ సాయుధ పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు. గౌతమ్ గంభీర్ 2019లో బీజేపీ త‌ర‌ఫున తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌సభ ఎంపీగా గెలిచారు.