భారీ ఉగ్రదాడికి ఐఎస్‌ఐ కుట్ర..

 

భారత్‌లో భారీ ఉగ్రదాడికి ఐఎస్‌ఐ కుట్ర చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి..  నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాలపై ఉగ్రవాదులు దృష్టి పెట్టినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అసోం రాజధాని గుహవాటి నుంచి వచ్చిన సమాచారంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. అంతేకాదు ప్రధాని, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గోవా సీఎం మనోహర్ పారికర్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.  చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఈశాన్య భారతంలో ప్రభుత్వం నిఘా పెంచింది. ఇక గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.