TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాకు బెదిరింపు లేఖ వచ్చింది.. బీజేపీ నేత

Published on: Sat Jan 23, 2016 2:48PM

ఈ మధ్య కాలంలో ఉగ్రవాదుల అక్రమాలు ఎంత ఎక్కువయ్యాయో వారి బెదిరింపు లేఖలు కూడా అలానే ఎక్కువయ్యాయి. ఇటీవలే ప్రధాని మోడీకి, పారికర్ కు బెదిరింపు లేఖలు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఓ బీజేపీ సీనియర్ నేత తనకు కూడా బెదిరింపు లేఖ వచ్చిందంటూ చెబుతున్నారు. షానవాజ్ హూస్సేన్.. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల నుంచి పోస్ట్ ద్వారా తనకు బెదిరింపులు వచ్చాయని.. ఉర్దు, ఇంగ్లీష్ బాషల్లో టైప్ చేసి బెదిరింపు లేఖను పంపించారని  పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు గతంలో కూడా సోషల్ మీడియా ద్వారా తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని చెప్పారు. 

కాగా డీసీపీ జతిన్ నర్వాల్ మాట్లాడుతూ షానవాజ్ హూస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించామని లేఖ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ జతిన్ నర్వాల్ వివరించారు.