TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీఆర్ఎఫ్ ఐఎస్ఐ సృష్టే.. భారత్ లో హింసే లక్ష్యం!

Published on: Wed Apr 23, 2025 10:47AM

జమ్మూ కాశ్మీర్ లోని  అనంతనాగ్ జిల్లా పహల్గాంలో  ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ప్రకటించడం ద్వారా ది రెసిస్టెన్స్ ఫోర్స్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్   (టీఆర్ఎఫ్)  ప్రకటించడంతో ఆ సంస్థ మరో మారు వార్తలలోకి ఎక్కింది. పహల్గాం  ఉగ్ర దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  ఈ దారుణానికి పాల్పడినది తానేనని ప్రకటించుకోవండంలో  టీఆర్ఎఫ్ మరో సారి చర్చలోకి వచ్చింది. ఈ టీఆర్ఎఫ్ ఏమిటి? దీని వెనుక ఉన్నదెవరు ? అన్న ప్రశ్నలు వినిపి స్తున్నాయి. 

కేంద్రంలోని మోడీ సర్కార్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పాక్ ప్రోద్బలం, ప్రోత్సాహంతో ఈ సంస్థ ఏర్పడింది.  ఉగ్రసంస్థ లష్కరే తోయిబా (ఏల్ఈటీ)కు అనుబంధంగా టీఆర్ఎఫ్ పని చేస్తున్నది. టీఆర్ఎఫ్ ఆవిర్భావం తరువాత అతి తక్కువ సమయంలోనే తన ఉనికిని బలంగా చాటుకుంది.  హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్ లాంటి ఉగ్ర సంస్థలకు చెందిన వారిని కలుపుకుని టీఆర్ఎస్ భారత్ లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడులకు వ్యూహరచన చేసింది.  టీఆర్ఎఫ్ ను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద 2023 జనవరిలో కేందం నిషేధించింది.

 షేక్ సజ్జాద్ గుల్ సుప్రీం కమాండర్‌గా, బాసిత్ అహ్మద్ దార్ ఆపరేషనల్ చీఫ్‌గా టీఆర్ఎఫ్ సామాజిక మాధ్యమం వేదికగా  భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది. కాశ్మీరీ పండిట్లు, స్థానిక పోలీసులు, కార్మికులు, పర్యాటకులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. ఇప్పుడు పహల్గామ్‌లో జరిగిన దాడి కూడా అలాంటిదేనని చెప్పాలి.  లష్కరే తోయిబా తరఫున పాక్ గూఢచార సంస్థే  టీఆర్ఎఫ్‌ను సృష్టించిందని అంటారు.