వైఎస్ కాంగ్రెస్‌వాదా? కాదా?
Published on: Fri Aug 3, 2012 11:53AM
ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చలకు దారి తీసింది. ప్రత్యేకించి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ అంశమే చర్చలకు దారి తీస్తోంది. వైఎస్‌కు ప్రచారం చేస్తే కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతోందన్న సర్వేల నేపథ్యంలో ఆ పార్టీ వైఎస్ చిత్ర పటాలను తొలగించి ఆయన పేరు ఉచ్ఛరించటమే మానేసింది. ఇంతకీ వైఎస్ కాంగ్రెస్ వాదా? కాదా? అన్న అంశం గురించి ఆయన అభిమానులు పార్టీకార్యాలయాల్లో నేతలను నిలదీస్తూనే ఉన్నారు. దీనికి సమాధానం ఇవ్వకుండా నేతలు తప్పించుకుంటున్నారు. అయితే ఇదే సమస్య హైదరాబాద్‌లోని గాంధీభవన్‌నూ కుదిపేసింది.
టీకప్పులో తుపానులా అదేంటీ వైఎస్ ఫొటో లేకుండా చేశారని వైఎస్‌సలహాదారు కెవిపిరామచంద్రరావు నేతలను నిలదీశారు. దీనిపై కెవిపి పలురకాల వ్యాఖ్యానాలు కూడా చేశారు. దీనికి కాంగ్రెస్ సీనియర్‌నేత, రాజ్యసభసభ్యుడు వి.హనుమంతరావు సమాధానమిస్తూ వైఎస్ ఫొటో పెట్టినందుకే కార్యకర్తల మనస్సులు క్షోభిస్తున్నాయన్నారు. వైఎస్ తనయుడు, వైకాపా అథినేత జగన్మోహనరెడ్డి సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్లు విమర్శించారన్న విషయమే కెవిపి గమనించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు మా మనస్సులు కూడా బాధపడ్డాయన్నారు. అలానే వైకాపా గౌరవాథ్యక్షురాలు విజయమ్మ ఊరూరా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని పలురకాలుగా విమర్శించారని, ఆ విషయంపై కెవిపి ఎందుకు స్పందించలేదని వి.హెచ్. ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య మాత్రమే కాకుండా పలుప్రాంతాల్లో వైఎస్‌ఫొటో గురించి వివాదాలు జరిగాయి. బతికి ఉన్నంత వరకూ కాంగ్రెస్ వాదే అయినా వైఎస్ తనయుడు మాత్రం తన సొంతపార్టీకే ఆయన్ని పరిమితం చేశారని కాంగ్రెస్ నేతలు దీనికి సమాధానం ఇస్తున్నారు. ప్రజలందరికీ కాంగ్రెస్ వాదైన వైఎస్ పరిచయమని, ఆయన్ని వైకాపా పార్టీకి షిఫ్ట్ చేసిన ఘనత మాత్రం జగన్మోహనరెడ్డిదని గమనించాలని కోరుతున్నారు.


