TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

థ‌ర్డ్‌వేవ్ సంకేతాలు!.. భారీగా పెరిగిన కొవిడ్‌ కేసులు..

Published on: Thu Dec 30, 2021 9:56AM

థ‌ర్డ్‌వేవ్ ఇకలేదు అనుకుని బిందాస్‌గా బ‌తికేస్తున్న జ‌నాల‌కు ఇది షాకింగ్ న్యూస్‌. దేశంలో రోజువారీ కేసులు భారీగా పెరిగుతున్నాయ్‌. ఒమిక్రాన్ వేరియంట్ సైతం వేగంగా వ్యాపిస్తోంది. పాజిటివ్ కేసుల‌న్నిటినీ జీనోమ్ సీక్వెన్స్ చేయిస్తే.. ఈ సంఖ్య మ‌రింత ఉండొచ్చ‌ని అంటున్నారు. కేసుల సంఖ్య పెరగ‌డం థ‌ర్డ్‌వేవ్ సంకేతాలా? అనే అనుమానం. 

ఇండియాలో కొంత కాలంగా రోజువారీగా 10 వేల లోపే పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. వాక్సినేష‌న్ ప్ర‌భావ‌మో.. క‌రోనా కాస్త స‌ద్దుమ‌నిగిందో.. కార‌ణం ఏదైనా కొన్ని నెల‌లుగా కొవిడ్ కంట్రోల్‌లోనే ఉంది. కానీ, ఒమిక్రాన్ ఎంట‌ర్ అయిన త‌ర్వాత ప‌రిస్థితి మారిపోయింది. రోజువారీ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్నాయి. తాజాగా, ఒక్కరోజే 13 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

బుధ‌వారం 11,99,252 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయ‌గా.. 13,154 మందికి వైరస్ సోకినట్లు తేలింది. అంత‌కుముందు రోజుకంటే ఈ సంఖ్య‌ 43 శాతం అధికం. బాధితుల సంఖ్య భారీగా పెరగడంతో.. క్రియాశీల కేసులపై ఆ ప్రభావం కనిపించింది. ప్రస్తుతం 82,402 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. 

ఇదే టైమ్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,000కి సమీపిస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు 961. వీరిలో 320 మంది కోలుకున్నారు. ఢిల్లీ (263), మహారాష్ట్ర (252)లు ఒమిక్రాన్‌కు అడ్డాగా మారాయి. దేశ‌వ్యాప్తంగా 22 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్‌ వేరియంట్ విస్త‌రించింది.