TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు! 

Published on: Thu Dec 30, 2021 8:15AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా సమీకరణలు మారిపోతున్నాయి. కొత్త పొత్తు అంశాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది. కాని ఆ రెండు పార్టీలు ఎక్కడా కలిసి పని చేయడం లేదు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు కూడా ఎవరికి వారే చేస్తున్నారు. రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై బీజేపీతో సంబంధం లేకుండానే జనసేన ఉద్యమించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ ఒక రోజు దీక్ష చేశారు. బీజేపీతో పొత్తులో ఉంటూ జనసేన చీఫ్ దీక్ష చేయడం చర్చగా మారింది. అమరావతి రాజధానికి రెండు పార్టీలు సపోర్ట్ చేస్తున్నా.. ఉమ్మడిగా కార్యక్రమాలు మాత్రం నిర్వహించడం లేదు. దీంతో బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకోవాలనే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారనే ప్రచారం జరిగింది.

పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు దిశగా ఆలోటన చేస్తున్నట్లు చర్చ సాగుతుండగానే.. అందుకు బలాన్నిచ్చేలా రాజకీయ పరిణామాలు ఏపీలో జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ,మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి ఫలితాలు కూడా సాధించాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు భవిష్యత్ లోనూ కలిసి పనిచేయనున్నాయనే టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే తాజా పరిమామాలు జరుగుతున్నాయి. జనసేనతో పొత్తుపై టీడీపీ సీనియర్ నేత బహిరంగంగానే కీలక వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో జరిగి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు జనసేనతో  కలిసి పోటీ చేస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ చైర్మన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లులో నిన్న నిర్వహించిన ‘టీడీపీ గౌరవ సభ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పాటు వామపక్షాలను కలుపుకుని పోతామన్నారు షరీఫ్. ఏపీలో  పరిస్థితులు బీహార్‌ను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే వీటిని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా, అసమర్థంగా వ్యవహరిస్తోందన్నారు. భద్రత, ప్రశాంత పాలనకు టీడీపీని ఆదరించాలని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు.

జనసేనతో పొత్తు  ఉంటుందంటూ టీడీపీ సీనియర్ నేత షరీఫ్ చేసిన కామెంట్లు ఏపీలో హాట్ హాట్ గా మారాయి. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి కాబట్టే సీనియర్ నేత, వివాదాలకు దూరంగా ఉండే షరీఫ్ చెప్పారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన జనసేన సమావేశాలు, సభల్లోనూ జగన్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసిన జనసేనాని.. చంద్రబాబుపై మాత్రం కొంత సాఫ్ట్ కార్మర్ లో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం ఇలా చేసిందని పవన్ కల్యాణ్ పదేపదే చెప్పడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. గతంలోనూ టీడీపీతో కలిసి జనసేన పోటీ చేసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఒకవేళ టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. ఏపీలో అనూహ్య ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.