TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హెచ్‌సీయూ భూములపై  స్మితా సబర్వాల్ రీట్వీట్..నోటీసులు

Published on: Wed Apr 16, 2025 4:14PM

.

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల  భూమిని చదును చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఏఐని ఊపయోగించి జింకలు, నెమళ్లు దీనస్ధితిలో చూస్తున్నట్లు ఫోటోలు ఎడిట్ చేశారు. అందులో మార్చి31న ఓ నెటిజన్ పోస్ట్ చేసిన తప్పుడు ఫోటోను ఐఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ షేర్ చేసినందున  తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు చేశారు. అయితే ఈ నోటీసులోని విషయాలను ఇప్పుడు బయటకు చెప్పలేమని పోలీసులు తెలిపారు.

హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు వీడియోలు, చిత్రాల ద్వారా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని, వీరి వెనుక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రభుత్వానికి నిఘా వర్గాలు నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడిన ఆయా యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు.