ఇండ‌స్ట్రీ కంటే జ‌గ‌నే ముఖ్య‌మా? నాగార్జున‌కు అంత ప్రేమెందుకు?

posted on: Jan 6, 2022 10:57AM

జ‌గ‌న్‌-నాగార్జున మంచి ఫ్రెండ్స్‌. జ‌గ‌న్ జైల్లో ఉన్న‌ప్పుడు కూడా నాగ్ వెళ్లి ఆయ‌న్ను క‌లిసొచ్చారు. అంత‌టి స్నేహం వారిది. ఇది అంద‌రికీ తెలిసిందే. జ‌గ‌న్ రాజ‌కీయాల్లో ఉన్నారు. నాగార్జున సినిమా ఇండ‌స్ట్రీ మ‌నిషి. మ‌రి, ఆయ‌న రాజ‌కీయం వ‌ల్ల.. ఈయ‌న ప‌రిశ్ర‌మ అల్ల‌క‌ల్లోలంగా మారింది. ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌లు టాలీవుడ్‌పై పిడుగుపాటుగా మారింద‌. ఇండ‌స్ట్రీ మొత్తం గ‌గ్గోలు పెడుతోంది. ప‌వ‌న్ అరుపులు సీఎం చెవికి సోకిన‌ట్టు లేదు. చిరంజీవి వేడుకున్నా జ‌గ‌న్ దిగిరాలేదు. నాగార్జున ప‌ర్స‌న‌ల్‌గా క‌లిసి రిక్వెస్ట్ చేసినా ప్రాబ్ల‌మ్ సాల్వ్ కాలేదు. రాఘ‌వేంద్ర‌రావు, రాజ‌మౌళి, దిల్ రాజురెడ్డి, క‌ల్యాణ్‌.. ఇలా ఎవ‌రు ఎంత‌గా చెప్పిచూసినా ప్ర‌భుత్వ విధానంలో మార్పు లేదు. లేటెస్ట్‌గా ఆర్జీవీ ఎంట‌ర్ కావ‌డంతో మ‌రింత కాక రేగింది.  ఆ శాఖ మంత్రి పేర్ని నానిని వ‌ర్మ మాగ్జిమ‌మ్ కార్న‌ర్ చేశారు. అంతా ప్ర‌భుత్వానిదే త‌ప్పు అన్న‌ట్టు.. ప్ర‌జ‌ల ముందు ఉంచేశారు వ‌ర్మ‌. ప‌నిలో ప‌నిగా త‌నొక్క‌డినే మాట్లాడితే యూజ్ ఉండ‌ద‌ని.. ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని.. స‌మ‌స్య‌పై ఇండ‌స్ట్రీ వాళ్లంతా స్పందించాల‌ని ఆర్జీవీ పిలుపిచ్చారు. కానీ, ఎవ‌రూ ప‌ట్టించుకున్న‌ట్టు.. ముందుకు వ‌చ్చిన‌ట్టు లేదు. అదీకాక‌.. తాజాగా నాగార్జున మ‌రింత ఇర‌కాటంలో ప‌డేసే ప్ర‌క‌ట‌న చేయ‌డం టాలీవుడ్‌ను షాక్‌కు గురి చేసిందంటున్నారు. 

"టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు విష‌యంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. టికెట్‌ ధరలు ఎక్కువగా ఉంటే మాకు ఎక్కువ డబ్బులొస్తాయి అంతే. నా సినిమా విడుదలకు ఇబ్బంది లేదు. సినిమా వేడుకకు సంబంధించిన వేదికపై రాజకీయ విషయాల గురించి మాట్లాడకూడదు. నేను మాట్లాడను" అంటూ నాగార్జున మాట్లాడ‌టంపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వ‌స్తోంది. 

త‌న సినిమా కోసం ఆయ‌న‌లా మాట్లాడార‌ని కొంద‌రంటుంటే.. ఇంత క‌ష్టం క‌లుగుతున్నా.. అస‌లేం ప్రాబ్ల‌మ్ లేద‌న్న‌ట్టు నాగార్జున లాంటి వారు మాట్లాడ‌టం అస‌లేమాత్రం త‌గ‌దంటున్నారు. టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపేమీ రాజ‌కీయ విష‌యం కాద‌ని.. సినిమాకు వేధిస్తున్న మేజ‌ర్ ప్రాబ్ల‌మ్ అని చెబుతున్నారు. నిర్మాత‌, న‌టుడు అయిన నాగార్జున‌కు ఈ విష‌యం తెలీదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు విష‌యంలో నాకెలాంటి ఇబ్బంది లేదు.. నా సినిమా విడుదలకు ఇబ్బంది లేదు.. అంటూ నాగార్జున స్టేట్‌మెంట్ ఇవ్వ‌డంతో ప్ర‌జ‌ల్లోకి వేరేలా మెసేజ్ వెళ్తుంద‌ని అంటున్నారు. 

అంటే, నాగార్జున సినిమాకే ప్రాబ్ల‌మ్ ఏమీ లేదంటే.. మిగ‌తా మూవీస్‌కు కూడా ఏమీ ఉండ‌ద‌ని.. ఈ గొడ‌వంతా కొంద‌రు బడా హీరోల కోస‌మేనా? అని అనుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. శ్యామ్‌సింగరాయ్ హీరో నానినే టికెట్ రేట్ల‌పై ఆవేద‌న వ్య‌క్తం చేస్తే.. బంగార్రాజు హీరో మాత్రం అస‌లేం ప్రాబ్ల‌మ్ లేద‌న్న‌ట్టు మాట్లాడ‌టం ఏంట‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తోంది. త‌న స్నేహితుడు జ‌గ‌న్‌కు స‌పోర్ట్‌గా నాగార్జున కావాల‌నే ఇలాంటి పాజిటివ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చారా? అని కూడా అనుమానిస్తున్నారు. వాళ్ల‌కు వాళ్ల‌కు మ‌ధ్య ఎలాంటి డీల్స్ అయినా కుదురుతాయి.. వాళ్లు వాళ్లు బాగానే ఉంటారు.. టికెట్ ధ‌ర‌లు త‌గ్గిస్తే మిగ‌తా సినిమా ప‌రిశ్ర‌మ కుదేల‌వ‌డం ఖాయ‌మంటున్నారు. వ‌ర్మ‌కు ఉన్నంత నాలెడ్జ్.. నాగ్‌కు లేదా? అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జ‌గ‌న్‌-నాగార్జున ఫ్రెండ్‌షిప్‌పై మీమ్స్‌ను వ‌దులుతున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...