TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహాభారతం ఆనవాళ్లు.. మహాద్భుతం.!!

Published on: Tue Jul 31, 2018 10:34AM

'తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి' అని వినుంటారు.. కానీ మహాభారత కాలంనాటి ఆనవాళ్లు, అవశేషాలు కనిపించాయి అని ఎప్పుడైనా విన్నారా.. జరిగింది ఆ మహాద్భుతం జరిగింది.. ఉత్తరప్రదేశ్‌లోని అలనాటి హస్తినాపురికి సమీపంలోని సనౌలీ అనే గ్రామంలో భారత పురావస్తు శాస్త్రవేత్తలు జూన్‌లో జరిపిన తవ్వకాల్లో మహాభారతకాలంనాటి రథాలు, కత్తులు, సమాధులు, శవపేటికలు, అస్థికలు బయటపడ్డాయి..  ఈ అవశేషాలను ఎర్రకోటకు తరలించారు.

 

 

ఇలా పురావస్తు శాఖ తవ్వకాల్లో రథం బయటపడటం దేశచరిత్రలోనే ఇది తొలిసారి.. నాలుగువేల ఏళ్లనాటి రాగి పిడి కలిగిన కత్తులను కనుగొనడం కూడా ఇదే తొలిసారి.. అదే విధంగా మొత్తం ఎనిమిది సమాధులను కనుగొన్నారు.. మరణానంతరం తినడానికన్నట్టు కొన్ని ఆహారపదార్థాలు, దువ్వెనలు, అద్దాలు, బంగారు పూసలు కూడా ఆయా సమాధుల్లో ఉన్నాయి.. కాగా, ఈ సమాధుల్లో లభ్యమైన ఎముకలను, దంతాలను డీఎన్‌ఏ పరీక్షలకు.. కత్తులు, ఇతర పరికరాలను మెటలర్జికల్‌ పరీక్షలకు శాస్త్రవేత్తలు పంపుతున్నట్టు తెలుస్తోంది.