TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోహ్లీ విదేశీ ప్లేయరా?.. స్టార్ బ్యాటర్ ఏమంటున్నాడు..

Published on: Sat Apr 4, 2026 4:04PM

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో కలిసి లండన్‌లో నివసిస్తున్నాడు. టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడడానికి, ఐపీఎల్ మ్యాచ్‌ల కోసమే అతడు భారత్‌కు వస్తున్నాడు.  చాలా రోజుల తర్వాత ఇండియన్ ప్రీమియర్‌ లీగ్-2026 కోసం భారత్‌కు వచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో గెలిపించాడు. అయితే కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. లండన్‌లో నివాసం ఏర్పరుచుకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐదో విదేశీ ఆటగాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

ప్రస్తుత ఐపీఎల్ సమయంలో కూడా ఆర్సీబీ టీమ్ మేనేజ్‌మెంట్‌కు కోహ్లీ కొన్ని షరతులు పెట్టాడట. మ్యాచ్‌లకు మధ్యలో ఎక్కువ వ్యవధి ఉంటే తనను ప్రత్యేక విమానంలో లండన్‌కు పంపించాలని కోరాడట. అందుకు ఆర్సీబీ మేనేజ్‌మెంట్ కూడా ఓకే చెప్పిందట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న విమర్శల గురించి కోహ్లీ స్పందించాడు .

ఆర్సీబీ ఐదుగురు విదేశీ ఆటగాళ్లతో ఆడుతోందని చాలా మంది అంటున్నారు. మిమ్మల్ని కూడా ఆ లిస్టులో ఎందుకు చేర్చారు అనే ప్రశ్నకు కోహ్లీ స్పందించాడు. ఆ విషయం తనకు తెలియదన్నాడు. అయినా , ఆ ప్రశ్న తనను ఎందుకు అడుగుతున్నావని ఎదురు ప్రశ్నించాడు. తానేమీ ఓవర్సీస్ ప్లేయర్‌ను కానని, ఆ ప్రశ్న విదేశీ ఆటగాడిని అడగమని చెప్పాడు. అలాగే ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌కు తాను ఎలాంటి షరతులూ పెట్టలేదని తెలిపాడు. ఇక, గత సీజన్‌లో ఆర్సీబీ కప్ గెలిచిన సందర్భాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు.