మండలిపైనా మడమ తిప్పేయడమేనా? జగన్ రెడ్డి మరో యూ టర్న్? 

posted on: Nov 23, 2021 9:09AM

మాట తప్పను... మడమ తిప్పను. ఇది ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నినాదం. కాని అధికారంలోకి వచ్చాకా మాట తప్పుతూనే ఉన్నారు జగన్ రెడ్డి. మడమ తిప్పుతూనే ఉన్నారు. మూడు రాజధానుల విషయంలో సోమవారం టర్న్ తీసుకునంది జగన్ సర్కారు. ఇటీవలే నిన్న ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనం విషయంలోనూ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుుకంది. తాజాగా  మరో విషయంలో మడమ తిప్పేయబోతోందని తెలిసింది. 

శాసనమండలిని రద్దుచేయాలని గతంలో చేసిన తీర్మానాన్ని జగన్ సర్కార్ వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం. మంగళవారం ఈ మేరకు శాసనసభలో కొత్త తీర్మానం చేయనున్నారని తెలుస్తోంది. శాసనమండలిని యథాతథంగా కొనసాగించాలని అందులో కేంద్రాన్ని కోరుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. శాసనమండలిని ద్దుచేయాలని కేంద్రాన్ని కోరుతూ గత ఏడాది జనవరి 27వ తేదీన శాసనసభలో తీర్మానం పెట్టారు.

2020,  జనవరిలో పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, మూడు రాజధానుల బిల్లులను శాసన మండలి వ్యతిరేకించింది. అయితే 151 స్థానాలున్న అసెంబ్లీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌ అని, ప్రజాబలంతో గెలిచిన శాసనసభ నిర్ణయాన్ని టీడీపీ బలం ఎక్కువగా ఉన్న మండలి వ్యతిరేకించిందని సీఎం జగన్‌ ఆగ్రహించారు. మండలి నిర్వహణకు రోజూ రూ.లక్షల్లో భారం మోయాల్సి వస్తోందని.. అసలీ వ్యవస్థే వద్దని.. రద్దుచేయాలని కేంద్రాన్ని కోరుతూ గత ఏడాది జనవరి 27వ తేదీన శాసనసభలో తీర్మానం పెట్టారు. నిజానికి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడే కొంద రు మంత్రులు జగన్‌ను సముదాయించే ప్రయత్నం చేశారు. ఏడాది వేచి చూస్తే.. మండలిలోనూ వైసీపీకి ఆధిక్యం వస్తుందని సర్దిచెప్పాలని చూశారు.

అయితే ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని జగన్‌ స్పష్టం చేశారు. ఇప్పుడు వైసీపీకి మండలిలో ఆధిక్యం లభించింది. ఇదే సమయంలో ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మం డలి రద్దు తీర్మానం ప్రస్తావనకు రానున్నట్లు ఉప్పందింది. ఇది వైసీపీ నేతలకు కలవరం కలిగించింది. దీంతో శాసనమండలి రద్దు తీర్మానం ఉపసంహరించుకుంటూ మరో తీర్మానాన్ని చేసి తక్షణమే కేంద్రానికి పంపాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేసింది. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతేనని వైసీపీ నేతలు ఇన్నాళ్లు ఇస్తున్న నినాదం క్రమంగా మసకబారుతోందని చెబుతున్నారు. మడమ తిప్పడమే ప్రస్తుతం జగన్ నినాదంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...