TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అడిగిన వెంటనే ఉపాధి ` అసలయ్యేనా?

Published on: Fri Sep 28, 2012 7:38AM

Is It Possible For Ready Employment, State Employment Department, Applications Issuing, Training To Workers, Money To Unemployees Scheme, Self Employment Schemes,

 

అడిగిన ప్రతి పేదవానికి వెంటనే ఉపాధిపనులు కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పథకంపై కూలీలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఉపాధి హామీ విభాగం నడుం బిగించింది. గ్రామీణస్థాయిలో పనులు కోరే కూలీలకు దరఖాస్తులు పంపిణీ చేసి, భర్తీచేసిన దరఖాస్తులన స్వీకరించేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. పనులు కోరడం, పొందడంపై శ్రమశక్తి సంఘాలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. పని కావాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పని అందేలా అలా పనులు పొందలేని వారికి నిరుద్యోగ భృతి అందేలా చర్యలు తీసుకునేందుకు ఈ ఏర్పాట్లు చేశామని చెప్పారు. హర్షించదగ్గ పరిణామం. అందరికి కూడు, గూడు, గుడ్డ ప్రధానం. అయితే అర్థశతాబ్దం దాటినా భారతావనిలో ఇంకా అవి పేదవానికి వరకు చేరలేదు. అంటే పథకాలు చేయలేదని కాదు! చేసిన పథకాలు వారివరకు రాలేదని, వారికి అందలేదని! ఒక రూపాయి పేదవాడికి సహాయంగా ప్రకటిస్తే...అది అందరిని దాటుకుంటూ ఆ పేదవాడిని చేరేసరికి ఐదు పైసలు మిగులుతుంది. అప్పటికి అతను వుంటాడో లేదో కూడా అనుమానమే. ఇటువంటి వ్యవస్థ మనదని సామాన్యులు వాపోతుంటారు. అటువంటప్పుడు అడిగితే చాలు... ఉపాధిపనులు అని చెబితే ఎలా నమ్మటమన్నది పేదవాని సందేహం! ఎవరూ ఏం చెప్పినా...ఎవరూ ఏం చేసినా.. సామాన్యులను బ్రతికించేది అతనికి భవిష్యత్‌పై వున్న ఆశ మాత్రమే అన్నది అక్షరసత్యం!