TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫీజు రగడపై కోర్టు జోక్యం అనివార్యమేనా?

Published on: Wed Aug 15, 2012 8:16AM

ఫీజుల తగ్గింపుపై ప్రభుత్వ ప్రకటనలు, యాజమాన్యాల నిరసనల నేపథ్యంలో .. కాలేజీల మేనేజ్‌మెంట్‌ ఫీజులు భారీగా తగ్గింపుతోపాటు అలా తగ్గించిన ఫీజును రెండేళ్ళపాటు కొనసాగించాలన్న నిబంధనలను ప్రభుత్వం విధిస్తుంటే... కాలేజీ యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. ఈసిఈ, సిఎస్‌సి, ఈఈఈ తదితర కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌ కోటా క్రింద కాలేజీల మేనేజ్‌మెంట్‌ కనీసం 60వేలరూపాయల వరకు తీసుకుంటుంటే.. దాన్ని 35వేల రూపాయలకే తగ్గించడంవల్ల క్యాపిటేషన్‌ ఫీజులు భారీగా వసూలు చేసే కాలేజీలు లాభపడతాయని, మాకు ఆదాయం పడిపోతుందని, సంక్షోభంలో పడిపోతామని కనుక 40వేలుగా ఫీజును మార్చాలని, ముందుగా చెప్పినట్లు ‘ఏడాది’ నిబంధననైనా అమలు చెయ్యాలంటూ కాలేజీ యాజమాన్యాలు డిమాండ్‌చేస్తున్న తీరు విద్య వ్యాపారంగా మారిందని తెలియజేస్తోంది.

 

ప్రభుత్వం ఆయా యాజమాన్యాలు తమ షరతులకు ఒప్పుకున్నాయంటూ విద్యార్ధులను మభ్యపెట్టడం తగదంటూ విద్యార్ధుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విద్యపై ప్రభుత్వానికి ఉన్న అలసత్వానికి ఇంతకంటే వేరే నిదర్శనం అవసరం లేదేమో...! ఈ తతంగమంతా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుండటంతో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని అయోమయంలో పడిపోతున్న విద్యార్ధిలోకం ఈ వివాదం ఇలాగే కొనసాగితే విద్యాసంవత్సరం నష్టపోవలసివస్తుందని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎవరేమైపోతే మాకేం... రాజుగారొచ్చారు మొదలెట్టండి...’ అన్నట్లుగా చర్చల పర్వం సుదీర్ఘంగా కొనసాగిపోతోంది. హైకోర్టు జోక్యం అనివార్యమే మరి!