షాకింగ్.. ‘గూగుల్ పే’కి అధికారిక గుర్తింపు లేదా!!

 

ఒకప్పుడు మనీ ట్రాన్స్ ఫర్ చేయాలంటే కాస్త సమయం పట్టేది. కానీ ఇప్పుడు యాప్ ల పుణ్యమా అని క్షణాల్లో పేమెంట్స్ జరుగుతున్నాయి. పేమెంట్స్ చేయడానికి వినియోగదారులు ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్‌లలో ‘గూగుల్ పే’ ఒకటి. అయితే ఈ యాప్‌పై ఇప్పుడు కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆర్బీఐ లైసెన్స్ లేకుండానే గూగుల్ పే కార్యకలాపాలు నిర్వహిస్తుందంటూ ఢిల్లీ హైకోర్టులో అభిజిత్ మిశ్రా అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్స్‌ చట్టాన్ని ఈ యాప్ ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్బీఐ గత నెల 20న విడుదల చేసిన అధికారిక పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్స్‌ జాబితాలో కూడా ‘గూగుల్ పే’ పేరులేదని కోర్టుకు వెల్లడించారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజేంద్ర మీనన్, జస్టిస్ ఏజే భంభానీల ధర్మాసనం విచారణ చేపట్టింది. గూగుల్ పేకి అధికారిక గర్తింపు ఉందో లేదో చెప్పాలంటూ ఆర్బీఐ, గూగుల్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.