TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కరోనాపై విజయానికి అదే ఆయుధం ..

Published on: Sun Dec 26, 2021 11:25AM

కరోనా పోలేదు. ఇంకా మన మధ్యనే వుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో చేసిన హెచ్చరిక ఇది. అయితే, అదే సమయంలో భయపడవలసిన అవసరం లేదని, అయినా జగ్రత్తగా ఉందామని అన్నారు.నిజానికి, ప్రధాని అన్నట్లుగా వ్యక్తిగత స్థాయిలో అందరం జాగ్రత్తలు తీసుకోవడమే కరోనాఫై పోరాటంలో పెద్ద ఆయుధం. ప్రపంచ అనుభావాలు కుడా అదే చెపుతున్నాయి. 

దేశంలో మరో మారు కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఓవంక ఒమిక్రాన్‌ వ్యాప్తి కొనసాగుతోంది. మరో వంక కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర రాజధాని ముంబై నగరాల్లో భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో కొత్తగా ఒకే రోజులో 249 కేసులు వచ్చాయి. ముందు రోజుతో పోలిస్తే దేశ రాజధానిలో  38శాతం పెరుగుదల నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. గత ఆరు నెలల్లో ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. మహారాష్ట్రలోని ముంబయిలో కొవిడ్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నిన్న (శనివారం) ఏకంగా 757 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే ముందు రోజుతో పోలిస్తే  10శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ సహా దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్త మయ్యాయి. కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో ఈ మహమ్మారి కట్టడికి మళ్లీ కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. అలాగే, కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో ఈ మహమ్మారి కట్టడికి మళ్లీ కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, దిల్లీ, యూపీ సహా పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు కూడా నిబంధనల్ని ప్రకటిస్తున్నాయి. 

హైకోర్టు ఆదేశాల మేరకు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి 2వరకు పలు కొవిడ్‌ నిబంధనలు ప్రకటించింది. ఇదలా ఇదలా ఉంటే కొవిడ్ కొత్త వేరియంట్ అంతగా ప్రమాదకరం కాకపోయినా, వేగంగా విస్తరించే ప్రమాదం ఉన్న నేపధ్యంలో పండగల సమయంలో అందరు అప్రమత్తంగా ఉండాలని, ప్రపంచ ఆరోగ్య సంస్థ, మన  ప్రధాని  నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరూ సూచిస్తున్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు, కొవిడ్ నిబంధనలు పాటించడంతో పాటుగా కొవిడ్ మహామ్మరికి కళ్ళెం వేయడంలో వాక్సినేషన్ మరో ముఖ్య ఆయుధం ప్రదాని పేర్కొన్నారు.వాక్సినేషన్ విషయంలో మన దేశం ఇతర దేశాలకు ఆదర్శం నిలించింది.  ఈ సంవత్సరం ఆరంభంలో జనవరి 16న ప్రరంభమైన వాక్సినేషన్ కార్యక్రమంలో ఇంతవరకు 141 కోట్ల డోసులు అధిగమించింది. అలాగే 61 ఏళ్ళు నిండిన వారిలో 61 శాతం మందికి  రెండు డోసులూ న్డాయి. 90 శాతం పైగా వయోజనులకు ఒక డోసు అందింది. 

ఇక ఇప్పుడు 15-18 సంవత్సరాల మధ్య వయస్కులకు జనవరి 3 వ తేదీ నుంచి, వాక్సినేషన్ కార్యక్రమం మొదలవుతుదని ప్రధాని ప్రకటించారు. అలాగే, జనవరి 10 వ తేదీనుంచి   ఆరోగ్య సిబ్బంది, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న 60 ప్లస్ వృద్దులకు డాక్టర్ సలహా మేరకు ముందు జాగ్రత్తగా  ‘ప్రీ కాషన్’  (బూస్టర్) డోసు ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు.ఆసుపత్రి పడకలు ఇతరత్రా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ప్రధాని చెప్పారు.అయితే.. కంటికి కనిపించని అదృశ్య శతృవును ఓడించడంలో  అప్రమత్త అవసరం అనే విషయాన్ని మాత్రం తిరుగులేని నిజం.