TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో బీహారీ పాలన?.. ఈ న్యూస్ పూర్తిగా చ‌దివితే షాకింగే..!

Published on: Mon Feb 28, 2022 2:47PM

ప్ర‌శాంత్ కిశోర్ ఎంట్రీ నుంచి.. డీజీపీ సెల‌వుల‌ వ‌ర‌కూ..!! సీఎస్ సోమేశ్ కుమార్‌ నుంచి కొత్త డీజీపీ ప్ర‌చారం వ‌ర‌కూ..!! తెలంగాణ పూర్తిగా బీహారీల గుప్పిట్లోకి జారుకుంటోంద‌ని అత్యున్న‌త వ‌ర్గాల్లో ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. లేటెస్ట్‌గా జ‌రిగిన‌ కేసీఆర్‌-పీకే చ‌ర్చ‌ల సారాంశం అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఆ వివ‌రాలు మ‌రింత షాకింగ్‌గా ఉన్నాయి. ఇంత‌కీ తెలంగాణ‌లో ఏం జ‌రుగుతోంది..?  బీహారీల పాల‌న ఎలా రాబోతోంది..? 

తెర తొలిగి పోయింది. తెలంగాణ రాజకీయాలలోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్’ (పీకే) ఎంట్రీ ఇచ్చేశారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు, జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పాత్ర తదితరాలకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ప్రశాంత్‌ కిశోర్‌ నడుమ రెండు రోజుల పాటు కీలక చర్చలు జరిగాయి. అయితే, ఇదేమీ కొత్త విషయం కాదు. నిజానికి, హుజూరాబాద్ పరాభవంతోనే  కేసీఆర్’లో కలవరం మొదలైంది. ఆ ఓటమి మొదలు ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతూ వచ్చింది. మెల్ల మెల్లగా ఆఖరి మెట్టుకు చేరుకుంది.అందుకే, చాలా కాలంగా పీకే ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడవి ఓపెన్ అయ్యాయి. చివరకు కేసీఆర్ పీకే, చేతికి తాళాలు ఇచ్చేశారు. నీట ముంచిన పాలముంచినా నీదే భారమని పీకేకి పగ్గాలు అప్పగించారు. 

అదలా ఉంచితే, పీకే ఎంట్రీతో తెలంగాణలో బీహారీ బాబుల పెత్తనం, పతాక స్థాయికి చేరే ప్రమాదముందన్నఅందోళన వినవస్తోంది. ఇప్పటికే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి-సీఎస్ సోమేష్ కుమార్ మొదలు కీలక శాఖలు అన్నీ బీహారీ బాబుల చేతిలేనే ఉన్నాయి. అత్యంత కీలకమైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు సమాచార, ప్రజాసంబంధాల కమిషనర్’గా ఉన్న అరవింద్ కుమార్’, అలాగే, రాష్ట్రంలో ఏకంగా ఎనిమిది కీలక శాఖల బాధ్యతలను చూస్తున్న సందీప్ కుమార్ సుల్తానియా, ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా, ప్రస్తుతం నీటిపారుద‌ల శాఖ‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న రజ‌త్ కుమార్‌, ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్, కనుసన్నల్లో నిలిచే అధికారులలలో బీహారీలే ఎక్కువగా ఉన్నారని అంటారు . ఇప్పుడు అదే బీహారుకు చెందిన పీకే, కీలకంగా మారడంతో అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తముతోందని అంటున్నారు. తెలంగాణకు సంబంధం లేని బీహారీల‌కు ప్రాధాన్యం ఇస్తూ అణగారిన వర్గాల వారిని విస్మరిస్తున్నారని కేసీఆర్ పై రాజకీయ వర్గాల్లోనే కాదు, అధికార వర్గాల్లోనూ విమ‌ర్శ‌లు ఉన్నాయి. 

అదలా ఉంటే, ఇప్పుడు రాష్ట్ర డీజీపీగా కూడా బీహారీనే వస్తున్నారని, ఇంతకు ముందు జరిగిన  నియామకాల విషయం ఎలా ఉన్నా, డీజీపీ నియామకం విషయంలో మాత్రం, పీకే ప్రమేయం ఉందని అంటున్నారు. నిజానికి, తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి సెల‌వులో వెళ్ళడం వెనక కూడా పీకే పాత్ర ఉందని అంటున్నారు. అయితే, ప్రభుత్వ వర్గాలు మాత్రం డీజీపే మ‌హేంద‌ర్‌రెడ్డి బాత్‌రూమ్‌లో కాలుజారి ప‌డ్డార‌ని.. చేయి విరిగింద‌ని.. అందుకే రెండు వారాలు లీవ్ పెట్టారంటున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మెడికల్ లీవ్‌పై వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ (హెచ్‌ఓపీఎఫ్)గా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చీఫ్ అంజనీకుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. నిజానికి, డీజీపీకి విధులకు హాజరు కాలేని విధంగా గాయాలు ఏమీ కాలేదని, అయినా ఆయన్ని సెలవు పై పంపారని అంటున్నారు. మహేందర్‌రెడ్డి సెలవుపై వెళ్లలేదని, సెలవుపై పంపారని అధికార వర్గాల్లో వినవస్తోంది. 

పీకే సూచనల మేరకు బీహారుకు చెందిన అంజనీకుమార్‌’ను డీజీపీగా నియమించేందుకు, మహేందర్‌రెడ్డిని రాజ్యసభకు పంపి, ఆస్థానంలో అంజనీకుమార్‌’ను కొనసాగించే ఉద్దేశంతో ప్రభుత్వం పావులు కదుపుతోందని అధికార వర్గాలో వినవస్తోంది. మరో  నాలుగు రోజుల్లో  మహేందర్ రెడ్డి సెలవు నుంచి వచ్చినా, మళ్ళీ సెలవు పై వెళ్ళే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ మరోమారు సెలవుపై వెళ్లేందుకు మహేందర్ రెడ్డి అంగీకరించక పోయినా, ఇతరత్రా సమస్యలు సృష్టించైనా ఆయనపై వేటు తప్పదని కూడా అంటున్నారు.   

ప్రశాంత్ కిశోర్, వ్యూహంలో ‘హింస’ కీ రోల్ ప్లే చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే, అందుకే డీజీపీగా బీహారీని తెచ్చుకున్నారని అంటున్నారు. ఇటు, సీఎస్, అటు డీజీపీ, అలాగే కీలక శాఖల అధికారులు బీహారీలే ఉంటే, ‘పీకే’ పని సులువు అవుతుందని, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇదే వ్యూహాన్ని పాటిస్తారని అంటారు. అదీగాక, తెలంగాణ ముద్దుబిడ్డ మూలాలు కూడా బీహార్’లోనే ఉన్నాయి,. సో.. పీకే రాకతో తెలంగాణలో బీహారీ పాలన వస్తుందా? బెంగాల్ తరహాలో హత్యాలు, అరాచకాలు పెరుగుతాయా? అంటే.. తినబోతూ రుచులెందుకు అంటున్నారు విశ్లేషకులు.