TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డొనాల్డ్ ట్రంప్ దిగిపోయేదాకా యుద్ధం ఆగదు.!

Published on: Thu Aug 13, 2026 9:10AM

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నడుమ ఇరాన్  సంచలన ప్రకటన చేసింది. అమెరికాతో సాగుతున్న యుద్ధం ఆ దేశాధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ ఆ పదవి నుంచి వైదొలిగే  వరకూ ఆదని కుండబద్దలు కొట్టింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ సీనియర్ సలహాదారు మహమ్మద్ రెజా నఖ్దీ చేసిన ఈ  ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. భవిష్యత్తులో ఇరాన్ వైపు కన్నెత్తి చూడటానికి లేదా దాడులకు పాల్పడటానికి ఏ శత్రు దేశమైనా ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వచ్చేలా చేయడమే తమ లక్ష్యమని, ఆవ్యూహంతోనే ముందుకు సాగుతున్నామని మహమ్మద్ రెజా పేర్కొన్నారు.  

శత్రువు  కోలుకోలేని స్థాయిలో ఆర్థిక, సైనిక నష్టం కలిగించడం ద్వారా  ముందు ముందు ఇరాన్ వైపు కన్నెత్తి చూడాలంటేనే ఏ దేశమైనా భయపడేలా చేయడమే ధ్యేయమని స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మహమ్మద్ రెజా నఖ్దీ..  ప్రస్తుత పోరాటంలో తాము వ్యూహాత్మకంగా విజయం సాధిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే తమ అంతిమ లక్ష్యం పూర్తి కాలేదన్నారు.  

అయితే అమెరికా సైనిక సామర్థ్యాలను దగ్గరుండి పరిశీలించే అవకాశం దక్కిందన్న ఆయన తాము ఊహించిన దాని కంటే.. అమెరికా సైన్యం చాలా బలహీనంగా ఉందన్నారు.  ఎంతకాలం యుద్ధం సాగినా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రతిరోజూ యుద్ధరంగంలో ప్రయోగిస్తున్న క్షిపణుల సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో కొత్త క్షిపణులను తాము ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించిన మహమ్మద్ రెజా..  యుద్ధం సుదీర్ఘంగా సాగితే.. ఇరాన్ అమెరికాకు మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు.  

Iran US conflict, Donald Trump Iran strategy, IRGC commander Naqdi, Iran missile production, Iran economic threats, TelugiOne