ఇరాన్ పార్లమెంట్ పై ఉగ్రవాది దాడి, ఒకరు మృతి

గుర్తుతెలియని ఉగ్రవాది ఇరాన్ పార్లమెంట్ పై చేసిన దాడిలో ఒక భద్రతాధికారి మృతి చెందగా, పలువురు గాయ పడ్డారు. దాడి చేసిన వ్యక్తి రెండు కలష్నికోవ్ రైఫిల్స్ మరియు ఒక హ్యాండ్ గన్ క్యారీ చేసాడని తెలిసింది. ఇరాన్ లోకల్ మీడియా కథనం ప్రకారం, అధ్యక్షుడి భవనం పూర్తిగా తాళం వేయబడి, ఎవరినీ లోపలి అనుమతించడం లేదు. అయితే, అదే సమయంలో పార్లమెంట్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అయాతుల్లా ఖొమెయినీ సమాధుల వద్ద కూడా ఒక ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. తర్వాత, ఖొమెయినీ వద్ద సూసైడ్‌ బాంబర్‌ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతాధికారులతో సహా 8 మంది గాయపడినట్లు సమాచారం. ఇరాన్ అధికార వర్గాలు ఈ దాడికి కుట్ర పాకిస్థాన్‌లో జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు ప్రాంగణంలో భద్రతా బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. ఈ రెండు సంఘటనల గురించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.