TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇరాన్ ఖేల్ ఖతం.!.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.!

Published on: Tue Jul 14, 2026 9:36AM

ఇరాన్  ఖేల్ ఖతమైందని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ సంచనల వ్యాఖ్యలు చేశారు.  అమెరికా, ఇరాన్ మధ్య రగులుతున్న దాడుల కారణంగా..  పశ్చిమాసియా ప్రాంతం  అగ్నిగుండంలా మారిన వేళ..  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఖేల్ ఖతం అంటూ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపుతున్నాయి.  ప్రముఖ అంతర్జాతీయ మీడియా ఛానల్  ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్   అమెరికా దాడుల్లో ఇరాన్ రక్షణ దళాలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాననీ,  ఆ దేశ సైనిక సామర్థ్యం ప్రస్తుతం శూన్యమనీ చెప్పారు.  

 ఇరాన్‌కు చెందిన అగ్రశ్రేణి కమాండర్లందరూ  హతమయ్యారనీ, ఇప్పుడు ఇరాన్ వద్ద చెప్పుకోదగ్గ నావికాదళం లేదు, వైమానిక దళం లేదు.. వారి వైమానిక రక్షణ నిఘా వ్యవస్థలు   నేలమట్టమయ్యాయన్నారు. ఇప్పుడిక ఇరాన్ వద్ద ఏమీ లేదనీ, నిస్సహాయ స్థితిలో ఉందనీ ట్రంప్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.   ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా  మరణశయ్యపై ఉన్నారని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 ఫిబ్రవరి 28న అంటే ఇరాన్, అమెరికా యుద్ధం ఆరంభమైన తొలి రోజునజరిగిన  వైమానిక దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే.  ఆ దాడుల్లోనే అలీ ఖమేనీ కుమారుడు..  ప్రస్తుత లీడర్  మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డారన్న ట్రంప్.. గత వారం జరిగిన తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోయిన మొజ్తబా ఖమేనీ.. ప్రస్తుతం  ప్రాణాలతో పోరాడుతున్నారని ట్రంప్ ఆ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు.  

Iran Khel Khatam, Donald Trump Iran comments, Mojtaba Khamenei health status, US Israel Iran war, Strait of Hormuz tensions, Iran attack on UAE ships, US protection fee shipping