TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇజ్రాయెల్ తో ఇరాన్ మాజీ అధ్యక్షుడి రహస్య ఒప్పందం?

Published on: Tue Jul 14, 2026 9:22AM

ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇజ్రాయెల్‌ను నామరూపాల్లేకుండా చేస్తానంటూ నిరంతరం నిప్పులు చెరిగిన కరడుగట్టిన నేత, మాజీ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదీనెజాద్.. ఇప్పుడు అదే ఇజ్రాయెల్‌తో చేతులు కలిపారా? ఇరాన్‌లో ప్రస్తుత ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూలదోసి, ఆ స్థానంలో అహ్మదీనెజాద్‌ను ఇరాన్ అధినేతగా కూర్చోబెట్టేందుకు ఇజ్రాయెల్ ఒక భారీ రహస్య వ్యూహాన్ని రచించిందా?  అంటే ఔననే చెబుతోంది.. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన సంచలన కథనం.  అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్  విశ్వసనీయ వర్గాలను  ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.  ఇజ్రాయోల్ కుట్ర  ఇరాన్ నిఘా వర్గాలు పసిగట్టాయనీ, దీంతో మహ్మద్ అహ్మదీనెజాద్‌ను  ఐఆర్‌జీసీ గృహనిర్బంధంలో ఉంచిందన్నది ఆ కథనం సారాంశం.  
ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీతో వచ్చిన విభేదాల కారణంగానే..  అహ్మదీనెజాద్ ఇజ్రాయెల్ ప్రతిపాదనలకు అంగీకరించినట్లు ఆ కథనం పేర్కొంది.  2024లో హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లోని లుడోవికా యూనివర్సిటీలో జరిగిన పర్యావరణ సదస్సు ముసుగులో..   ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ  మొసాద్ అప్పటి చీఫ్ డేవిడ్ బార్నియా నేరుగా అహ్మదీనెజాద్‌తో సుదీర్ఘ చర్చలు జరి;పారనీ, , ఇజ్రాయెల్ అధికారులతో చర్చలు జరిపేందుకు అహ్మదీనెజాద్ బుడాపెస్ట్‌ ప్రయాణ, వసతి ఖర్చులను కూడా ఇజ్రాయెలే భరించిందని, ఇదే విషయాన్ని మొసాద్   అమెరికా సిఐఎకి కూడా చేరవేసిందని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. 

కాగా, ఇరాన్, అమెరికా మధ్య జరిగిన దాడుల సమయంలో ఈ వ్యూహం పతాక స్థాయికి చేరింది. ఇరాన్‌లోని అహ్మదీనెజాద్ నివాసంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగి ఆయన రక్షణ వాహనాలు ధ్వంసమైన వెంటనే..  ఒక  ప్యుజో కారు అక్కడికి చేరుకుని ఆయనను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఆ కారును నడిపింది మొసాద్ ఏజెంట్లని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. అయితే, ఇజ్రాయెల్ తనను మళ్లీ అధికారంలోకి తెస్తుందనే నమ్మకం సడలడం, ఆ రక్షణ చర్యలపై అనుమానాలు రావడంతో అహ్మదీనెజాద్ ఆ సేఫ్ హౌస్ నుండి బయటకు వచ్చేశారు. అప్పటి నుంచీ   ప్రజల కంటపడని ఆయన.. గత వారం దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ మాత్రమే కనిపించారు.

2005 నుండి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అహ్మదీనెజాద్ ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. కానీ పదవి నుంచి దిగిపోయాక అవినీతిని వ్యతిరేకిస్తూ   గొంతు మార్చారు. ప్రస్తుత ఇస్లామిక్ వ్యవస్థ కుప్పకూలితే తాను దేశాన్ని నడిపించగలనని, ట్రంప్ హయాంలో కుదిరిన  అబ్రహం ఒప్పందాల తరహాలోనే ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణ స్థితికి తెస్తానని ఆయన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే న్యూయార్క్ టైమ్స్ కథనంపై  అటు ఇరాన్ కానీ, ఇటు ఇజ్రాయెల్ కానీ అధికారికంగా స్పందించలేదు. 

Iran former president secret agreement, Mahmoud Ahmadinejad, Mossad, Iran Politics, Israel Mossad Scandal, Ahmadinejad News, Iran Regime Change