TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదలీలు

Published on: Tue Jan 21, 2025 11:39AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున  ఐపీఎస్ అధికారులను   బదిలీ చేసింది. మొత్తం 27 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ సోమవారం రాత్రి   ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదలీలలో పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న కొందరికి పోస్టింగులు లభించాయి.  తిరుపతిలో తొక్కిసలాటకు బాధ్యులుగా భావిస్తూ బదిలీ కి గురై పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న తిరుపతి మాజీ ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ కు ఈ బదిలీల్లో పోస్టింగ్ లు ఇచ్చారు. కేంద్రంలో డిప్యుటేషన్ ముగించుకొని వచ్చిన మధుసూదన్ రెడ్డి, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పాలరాజుకు కూడా పోస్టింగులు దక్కాయి.  ఇక  ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్ మీనాను నియమించారు.

రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా ఎన్ మధుసూదన్ రెడ్డి. ఐజీ ఆపరేషన్స్ గా సీహెచ్ శ్రీకాంత్ నియమితులయ్యారు.  అలాగే టెక్నికల్‌ సర్వీసెస్‌ ఐజీగా  ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇకపోతే ఏపీ ఎస్పీ బెటాలియన్ ఐజీగా బీ రాజకుమారి, ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గా జీ పాల రాజుకు పోస్టింగ్ ఇచ్చారు.  తిరుపతి ఎస్పీగా హర్షవర్దన్ రాజు, తిరుపతి జిల్లా ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడులను నియమించారు.  కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను కర్నూలు ఎస్పీగా బదిలీ చేశారు. ఇక ఆయన స్థానంలో కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్ ను నియమించారు. కడప ఎస్పీగా అశోక్ కుమార్, ఏసీబీ డైరెక్టర్ గా ఆర్. విజయలక్ష్మి, ఎపీఎస్పీడీజీపీగా ఫక్కీరప్పలను నియమిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.  పీటీవో డీఐజీగా సత్యఏసుబాబు,  వెల్ఫేర్‌ అండ్‌ స్పోర్ట్స్‌ డీఐజీగా అన్బురాజన్‌‌, ఏపీఎస్పీ కర్నూల్‌ రెండో బెటాలియన్‌ కమాండెంట్‌గా ఎం దీపిక, అదే విధంగా ఎస్‌సీఆర్‌బీ, సీఐడీ ఎస్పీగా పి పరమేశ్వరరెడ్డి నియమితులయ్యారు.

కో-ఆర్డినేషన్, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ లీగల్‌ ఎస్పీగా కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి,  సీఐడీ ఎస్పీ లుగా ఎన్‌ శ్రీదేవి రావు, ఎస్‌ శ్రీధర్‌, కె చక్రవర్తి,  ఇంటెలిజెన్స్‌ ఎస్పీలుగా జె రామ మోహన్‌రావు, ఎ రమాదేవిలను నియమించారు. విశాఖపట్నం, విజయవాడ అడ్మినిస్ట్రేషన్ డీసీపీలుగా కృష్ణకాంత్‌ పటేల్‌, సరిత, అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీగా ధీరజ్‌ కునుబిల్లి , అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌)గా జగదీశ్‌‌ను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.