మిశ్రా హ్యాట్రిక్ తో గట్టెక్కిన సన్ రైజర్స్

IPL-6 Sunrisers Hyderabad Beat Pune Warriors, Amit Mishra hat-trick helps Sunrisers Hyderabad beat Pune Warriors, IPL 6: Hyderabad Sunrisers beat Pune warrior by 11 run

 

పూణే వారియర్స్ తో సన్ రైజర్స్ ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. పూణే వారియర్స్ కు రెండు ఓవర్లలో, చేతిలో నాలుగు వికెట్లు ఉండగా 14 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో బౌలింగ్ కు దిగిన అమిత్ మిశ్రా మొదటి బంతికి పాండే సింగిల్ తీశాడు, రెండో బంతికి మాథ్యూస్ (20) స్టెయిన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యాడు, మూడో బంతికి మళ్ళీ పాండే సింగిల్ తీశాడు, నాలుగో బంతికి భువనేశ్వర్  కుమార్ ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు, ఐదో బంతికి రాహుల్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు, ఆరో బంతికి అశోక దిండా కూడా క్లీన్ బౌల్డ్ అవడంతో హ్యాట్రిక్ సాధించాడు. ఐపిఎల్ టోర్నీలో అమిత్ మిశ్రాకు ఇది మూడో హ్యాట్రిక్. టాస్ గెలిచినా పూణే వారియర్స్ సన్ రైజర్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.ఓపెనర్ డీ కాక్ మొదటి ఓవర్ లోనే అశోక దిండా బౌలింగ్ లో మార్ష్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. ఆ తరువాత వరుస బంతుల్లో మరో ఓపెనర్ పార్థివ్ పటేల్ (12), కెప్టెన్ కెమరూన్ వైట్ (0) లను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ కు పంపాడు. హనుమ విహారీ (1) వికెట్ ను భువనేశ్వర్ కుమార్ తీసుకున్నాడు. సమంత్రే (37) పరుగులతో బాధ్యతాయుతంగా ఆడుతున్న సమయంలో రాహుల్ శర్మ బౌలింగ్ లో పాండే క్యాచ్ పట్టగా వెనుతిరిగాడు. ఇన్నింగ్స్ చివర్లో అమిత్ మిశ్రా (30) రనౌట్, ఆశిష్ (19) చెలరేగి ఆడడంతో సన్ రైజర్స్ ఇన్నింగ్ వంద పరుగులు దాటింది. వీరిద్దరూ ఎనిమిదో వికెట్ కు 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్టెయిన్ 4 నాటౌట్ గా నిలిచాడు. సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు చేసింది. భువనేశ్వర్ 3, రాహుల్ శర్మ 2, అశోక దిండా 1, మార్ష్ 1 వికెట్ తీశారు. తరువాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పూణే వారియర్స్ దూకుడుగా ఆడింది. దూకుడుగా ఆడుతున్న ఓపెనర్లు రాబిన్ ఊతప్ప 14 బంతుల్లో 22 పరుగులు (4 బౌండరీలు), ఫించ్ 13 బంతుల్లో 16 పరుగులు (3 బౌండరీలు)లను పెరీరా అవుట్ చేశాడు. స్మిత్ 17 నెమ్మదిగా ఆడుతూ స్కోరు పెంచే క్రమంలో ఇషాంత్ శర్మ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి బౌండరీ వద్ద ఆశిష్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సుమన్ 12ను కరణ్ శర్మ ఎల్బీడబ్ల్యూ గా అవుట్ చేశాడు. మార్ష్ 14ను ఆశిష్ క్యాచ్ పట్ట్టగా స్టెయిన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అభిషేక నాయర్ 0ను సమంత్రే క్యాచ్ ద్వారా పెరీరా బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. పూణే వారియర్స్ 19 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బౌలింగ్ విభాగంలో అమిత్ మిశ్రా 4, పెరీరా 3,ఇషాంత్ శర్మ 1, స్టెయిన్ 1, కరణ్ శర్మ 1 వికెట్లు పడగొట్టారు. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ చక్కగా రాణించిన అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.