సూపర్ ఓవర్లో బోల్తా పడిన ఢిల్లీ డేర్ డెవిల్స్

IPL6 RCB beat Daredevils in thrilling Super Over, RCB clinch Super Over thriller against Delhi Daredevils in IPL 6,  Royal Challengers Bangalore pipped Delhi Daredevils in the Super Over

 

ఐపిఎల్-6 సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు వరుసగా ఐదో పరాజయం పొందింది. ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లో భాగంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో తలపడిన ఢిల్లీ డేర్ డెవిల్స్ సూపర్ ఓవర్లో చతికిలపడింది. ఈ సీజన్ లో మొదటిసారిగా విజయం అంచులకు చేరిన ఢిల్లీ డేర్ డెవిల్స్ కు అర్జున్ రామ్ పాల్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఖంగు తినిపించాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరుకు ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒపెన్నర్లు డేవిడ్ వార్నర్13 బంతుల్లో 15 పరుగులు (3బౌండరీలు), వీరేంద్ర సెహవాగ్ 23 బంతుల్లో 25 పరుగులు (4బౌండరీలు) చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరూ వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఢిల్లీ కెప్టెన్ జయవర్థనే 31 బంతుల్లో 28 పరుగులు (2బౌండరీలు), జునేరా 17. రోహెర్ 14 భారీ స్కోర్లు చేయలేకపోయారు. చివరి రెండు ఓవర్లలో ఇర్ఫాన్ పఠాన్ 8 బంతుల్లో 19 పరుగులు నాటౌట్ (2 బౌండరీలు 1 సిక్సర్) జాదవ్ 16 బంతుల్లో 29 పరుగులు నాటౌట్ (2 బౌండరీలు 1 సిక్సర్) సాధించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్లు గిల్ క్రిస్ట్ 9, రాహుల్ 12 మరోసారి శుభారంభాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 50 బంతుల్లో 65 పరుగులు (7 బౌండరీలు 1 సిక్సర్), డివిలియర్స్ 32 బంతుల్లో 39 పరుగులు (3 బౌండరీలు 1 సిక్సర్) మూడో వికెట్ కు 103 పరుగులు జోడించడంతో గెలుపు ఇక లాంఛనమే అనుకున్నారు అందరూ అయితే వీరిద్దరూ కొద్ది బౌల్స్ తేడాతో అవుట్ అయ్యారు. మెక్ డోనాల్డ్ 0, అరుణ్ కార్తీక్ 5 రనౌట్, సయ్యద్ మొహమ్మద్ 1, వినయ్ కుమార్ 1 నాటౌట్, అర్జున్ రామ్ పాల్ 12 నాటౌట్ గా నిలిచారు. విజయానికి ఆఖరి ఓవర్లో 12 పరుగులు కావాల్సి ఉండగా రామ్ పాల్, వినయ్ కుమార్ కలిసి 11 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్ ను ప్రారంభించిన బెంగళూరు ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో 15 పరుగులు చేసింది. క్రిస్ గేల్ 2సింగిల్స్ తీయగా డివిలియర్స్ 3 సిక్సర్లు ఒక సింగిల్ తీశాడు. రెండో సూపర్ ఓవర్ లో ఢిల్లీ 2 వికెట్లు కోల్పోయి 11పరుగులు చేసింది. అర్జున్ రామ్ పాల్ వేసిన మొదటి బంతికి వార్నర్ అవుట్ అయ్యాడు. రెండో బంతిని ఇర్ఫాన్ పఠాన్ బౌదరీకి తరలించాడు. మూడో బంతికి పరుగులు రాలేదు. నాలుగో బంతికి ఇర్ఫాన్ సిక్సర్ సాధించాడు. ఐదో బంతిని ఇర్ఫాన్ సింగిల్ తీశాడు. విజయానికి సిక్సర్ కావాల్సి ఉండగా రోహెర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కొహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.