చెన్నైకి చుక్కలు చూపించిన కోల్ కత్తా

IPL 6: Ravindra Jadeja's heroics take Chennai past Kolkata, Chennai Super Kings beat KKR after Sir Ravindra Jadeja runs amok, Chennai Super Kings inflict a thrilling defeat on KKR in IPL 6

 

ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లో భాగంగా శనివారం కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ X కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచి బ్యాంటింగ్ కు దిగిన కొలకత్తా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కోల్ కత్తా ఓపెనర్లు గౌతమ్ గంభీర్ 19 బంతుల్లో 25 పరుగులు (5 ఫోర్లు) యూసఫ్ పఠాన్ 22 బంతుల్లో 25 పరుగులు (4 ఫోర్లు) చెలరేగి ఆడారు. మొదటి వికెట్ కు వీరిద్దరూ కలిసి 35 బంతుల్లో 46 పరుగులు చేసిన తరువాత క్రిస్ మోరిస్ బౌలింగ్ లో డేవిడ్ హస్సీ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. యూసుఫ్ పఠాన్ రనౌట్ అయ్యాడు. తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ కలీస్ 0 రనౌట్, మోర్గాన్ 2 బ్రేవో బౌలింగ్ లో జడేజా క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. దేబబాత్ర దాస్ 15 బంతుల్లో 19 పరుగుఒలు (2సిక్సర్లు), మనోజ్ తివారీ 18 బంతుల్లో 13   పరుగులు చేసి కాసేపు చెన్నై బౌలర్లకు పరీక్ష పెట్టారు. దాస్ ను ఎల్బీడబ్ల్యూ గా అశ్విన్ పెవిలియన్ కు పంపగా మనోజ్ తివారీని శర్మ క్యాచ్ పట్టగా అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. సునీల్ నరైన్ కాసేపు పోరాడాడు 6 బంతుల్లో 13 పరుగులు (2 సిక్సర్లు) ను జడేజా బౌలింగ్ లో శర్మ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యాడు. జడేజా 3 ఆహ్విన్ 2 బ్రేవో 1 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అశ్విన్ 13 బంతుల్లో 11 పరుగులు (2 ఫోర్లు) చేసి సేననాయకే క్యాచ్ ద్వారా నరైన్ పెవిలియన్ కు పంపాడు. మరొక ఓపెనర్ మైక హస్సీ నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. లక్ష్యం చిన్నదే అయినా చెన్నై బ్యాట్స్ మెన్ తడబడ్డారు. మురళీ విజయ్ 2 సేననాయకే బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా, రైనా 7 యూసుఫ్ పఠాన్ బౌలింగ్ లో నరైన్ క్యాచ్ పట్టడంతో, చెన్నై కెప్టెన్ ధోని 9 రనౌట్, బద్రీనాథ్ 6 ను కల్లీస్ క్లీన్ బౌల్డ్ చేయడంతో వెంట వెంటనే పెవిలియన్ చేరారు.  ఈ దశలో మైక హస్సీకి జోడుగా రవీంద్ర జడేజా బ్యాటింగ్ కు దిగాడు. జడేజా చెలరేగి ఆడాడు

 మైక హస్సీ 51 బంతుల్లో 40 పరుగులు (2 ఫోర్లు  1 సిక్సర్) ను బాలాజీ బౌలింగ్ లో యూసుఫ్ పఠాన్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. జడేజా 14 బంతుల్లో 36 పరుగులు (3 ఫోర్లు 3 సిక్సర్లు) నాటౌట్, బ్రేవో 4 బంతుల్లో 7 పరుగులు (1ఫోర్) నాటౌట్ తోడయ్యాడు వీరిద్దరూ కలిసి 14 బంతుల్లో 35 పరుగులు చేశారు. జడేజా కలీస్ బౌలింగ్ లో 2 ఫోర్లు, బాలాజీ, నరిన్, యూసుఫ్ పఠాన్ బౌలింగ్ లో మూడు భారీ సిక్సర్లు కొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి విజయం సాధించింది. సునీల్ నరిన్ 1, కలీస్ 1, యూసఫ్ పఠాన్ 1 సేననాయకే 1 వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రవీంద్ర జడేజా అవార్డు అందుకున్నాడు.