చెన్నైకి 206 పరుగుల టార్గెట్ నిర్దేశించిన రాయల్ చాలెంజర్స్
Published on: Thu Apr 12, 2012 6:13PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్లో భాగంగా నేడు చెన్నైతో జరుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్రిస్ గేల్ క్రిస్ గేల్ 35 బంతులో 6 సిక్స్ లు 4 ఫోర్లుతో 68 పరుగులు చేయగా, విరాట్ కోహ్లి 2 సిక్స్ లు 5 ఫోర్లుతో 57 పరుగులు చేసాడు. చెన్నై బౌలర్లలో బోలింగర్ 3 వికెట్లు, మోర్కెల్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.


