TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉత్కంఠ పోరులో గెలిచిన ముంబై ఇండియన్స్

Published on: Tue Apr 10, 2012 12:33PM

ipl 5 2012, Mumbai Indians,  Mumbai Indians vs Deccan Chargers, IPL 5 Deccan Chargers, IPL 5 Rohit Sharmaఐపిఎల్ 5 2012: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై జట్టు 5 వికెట్ల తేడాతో చార్జర్స్‌పై గెలిచింది. రోహిత్ శర్మ (50 బంతుల్లో 73 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌తో, ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి మరీ ముంబైని గెలిపించాడు.139 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి గెలిచింది.


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డెక్కన్ చార్జర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (24 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ముంబై బౌలర్లపై మెరుపుదాడి చేశాడు. క్రిస్టియాన్ (36 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించినా... ముంబై బౌలర్లు పుంజుకుని వికెట్లు తీసి చార్జర్స్‌ను అడ్డుకున్నారు. స్లాగ్ ఓవర్లలో వైట్ (22 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ముంబై బౌలర్లలో మునాఫ్ పటేల్ నాలుగు వికెట్లు తీసుకోగా... మలింగ మూడు, పొలార్డ్ 2 వికెట్లు పడగొట్టారు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.