TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నా మరణదిన వేడుకలకు రండి.. మాజీ మంత్రి వింత ఆహ్వానం

Published on: Mon Dec 19, 2022 5:43AM

పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం చూశాం.. వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడమూ చూశాం. ఇంకా గృహ ప్రవేశాలు, ఓణీ ఫంక్షన్లు, వివాహాలు ఇలా శుభ కార్యాలకు ఆహ్వానా పత్రికలు ముద్రించి పంచడమూ తెలుసు. కానీ ఒకాయన మాత్రం 12 ఏళ్ల తరువాత తాను మరణిస్తాననీ, అందుకే ఇప్పటి నుంచే తన మరణ దిన వేడుకలు ఏటా జరుపుకుంటాననీ అంటున్నారు.

ఇందు కోసం తన మరణ దిన ఆహ్వాన పత్రికను ముద్రించి మరీ పిలుస్తున్నారు.  ఔను వినడానికి వింతగా ఉన్నా అది నిజం. మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు ఈ కొత్త ఆహ్వానం పలుకుతున్నారు.  తన మరణ దినోత్సవానికి రావాలంటూ ముద్రించిన ఆహ్వాన పత్రికలో మాజీ మంత్రి పాలేటి రామారావు  ఇకపై తాను ఏటా మరణ దిన వేడుకలు జరుపుకోవాలని భావిస్తున్నట్లే పేర్కొన్నారు.

పుట్టన రోజు వేడుకలు జరుపుకోవడం అర్ధ రహితమనీ, 2034లో తాను మరణిస్తాననీ, మరో 12 ఏళ్ల తరువాత అంటే 2034లో తాను మరణిస్తాననీ. ఇక ఇప్పటి నుంచీ ఏటా తన మరణ దిన వేడుకలు జరుపుకుంటాననీ పేర్కొన్నారు. ఆ వేడుకలకు హాజరై ఆశీర్వదించాలని పాలేటి రామారావు ఆ ఆహ్వాన పత్రికలో కోరారు.  

1994, 1999 ఎన్నికలలో తెలుగుదేశం తరఫున పోటీ చేసి విజయం సాధించిన పాలేటి రామారావు మంత్రిగా కూడా చేశారు. 2004లో తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఆ తరువాత ప్రజారాజ్యంలో చేరారు. ఆ తరువాత వైసీపీలో చేరి కొనసాగుతున్నారు.