Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్ లో ప్రారంభమైన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్.
posted on: Jan 13, 2025 4:48PM
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. హైద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 7 వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. తెలంగాణ పర్యాటక శాఖ ఈ వేడుక నిర్వహిస్తోంది. దాదాపు 19 దేశాలకు చెందిన 47 మంది ప్రొఫెషనల్ కైట్ ప్లయ్యర్స్ ఈ వేడుకలో పాల్గొన్నారు. అలాగే 14 రాష్ట్రాలకు చెందిన కైట్ ప్లయ్యర్స్ భాగస్వాములయ్యారు. నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా, తైవాన్, ఇటలీ, మలేషియా, వియాత్నం, పిలిప్పీన్స్,కొరియా, థాయ్ లాండ్, స్కాట్లాండ్ , కంబోడియా, కెనెడా, శ్రీలంక, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన 50 మంది కైట్ ప్లయ్యర్స్ హాజరయ్యారు. మూడురోజులపాటు జరుగనున్న కైట్ ఫెస్టివల్ కు తెలుగురాష్ట్రాలకు చెందిన గాలి పటాక ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.


.webp)



